మార్కెట్లో మోదీ క్రాకర్స్

Modi crackers in market

03:46 PM ON 28th October, 2016 By Mirchi Vilas

Modi crackers in market

ఈసారి దీపావళికి చైనా క్రాకర్స్ వస్తున్నాయని, వాటికి దూరంగా వుండాలని పలువురు మొరపెట్టుకుంటున్నారు. అయితే అనూహ్యంగా ప్రధాని మోడీ పేరిట క్రాకర్స్ వచ్చేసాయి. ఇటీవల ఏదైనా నేషనల్ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు.. అందుకు సంబంధించిన ప్రొడక్టులపై ప్రధాని మోడీ పిక్ ని ముద్రించడం మరింత ఎక్కువైంది. మోడీ బ్రాండ్ ఇమేజ్ ని తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు కొన్ని కంపెనీలు. మొన్నటికి మొన్న దసరాకి కూడా తయారీదారులు బానే వినియోగించుకున్నారు. ఇక దీపావళి నేపథ్యంలో మోడీ పేరిట ఫైర్ క్రాకర్స్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ పోకడ యూపీలోని అలహాబాద్, వారణాసిలో మరింత ఎక్కువగా వుంది. ఎందుకంటే యూపీ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. తయారీదారులు మోదీ బ్రాండ్ ని, ఎస్పీ నేతల ఫోటోలను ఇలా ఉపయోగించిన టపాకాయలను పోటాపోటీగా అమ్ముకాలు సాగిస్తున్నారు. ఇక సంక్రాంతికి ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తాయోనని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

English summary

Modi crackers in market