మోడీ రెండేళ్ల పాలనపై దేశవ్యాప్త సంబరాలు

Modi Governments 2 Year Anniversary Events Across India

03:20 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Modi Governments 2 Year Anniversary Events Across India

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా సంబరాలు నిర్వహించబోతోంది. కేంద్ర మంత్రులు, పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన వేడుకలను నిర్వహించనున్నారు. మే 27 నుంచి జూన్ 15 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. రేపు ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మోడీ హాజరుకానున్నారు.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ మోడీ, కేంద్ర మంత్రులు, పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన వేడుకలను నిర్వహించనున్నారు.గతేడాది నిర్వహించిన మొదటి విజయోత్సవ సభ మథురలో జరిగింది. రెండేళ్ల పాలన విజయోత్సవ వేడుకలను 198 నగరాల్లో 33 బృందాలు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈనెల 27న వివిధ ప్రాంతాల్లో భాజపా ఏర్పాటు చేయనున్న కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. దిల్లీలో రాజ్ నాధ్ సింగ్ , జయపురలో సుష్మాస్వరాజ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, లఖ్నవూలో అరుణ్ జైట్లీ, బెంగళూరులో వెంకయ్యనాయుడు, చెన్నైలో మనోహర్ పారికర్, సురేశ్ ప్రభు కొలకత్తాలో , సదానంద గౌడ నాగ్ పూర్లో , ఉమాభారతి హల్ద్వానిలో, రామ్ విలాస్ పాశవాన్ అమృత్సర్లో, రవిశంకర్ ప్రసాద్ ముంబయిలో అలాగే జేపీ నడ్డా వారణాసిలో జరిగే సభల్లో పాల్గొంటారు. ఇక మోడీ పాలన భేషుగ్గా వుందని అధికార పక్ష నేతలు అంటుంటే , విపక్షాలు మాత్రం ఎం సాధించారని ఈ వేడుకలు అంటూ పెదవి విరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:బ్యాగులో ఏముందో చూస్తే షాకౌతారు

ఇవి కూడా చదవండి:మే నెలలో పుట్టిన వారి విశిష్ట లక్షణాలు

ఇవి కూడా చదవండి:ఒకే సినిమాలో తండ్రి కొడుకు పాత్రల్లో అలరించిన మన హీరోలు

English summary

BJP party to celebrate Narendra Modi Government's second anniversary celebrations across India. Central Ministers to celebrate this event in Different places in India.