ఫేస్ బుక్ లో మోడీ దూకుడు

Modi In Second Place In Facebook

10:02 AM ON 20th January, 2016 By Mirchi Vilas

Modi In Second Place In Facebook

కమ్యునిటీలో ఒబామానూ మించిపోయారు

ప్రస్తుతం సోషల్ మీడియా కు వున్న దూకుడు ముందు ఏదీ ఆగదు అనేట్లు వుంది. ఇలా అప్ లోడ్ చేస్తే అలా క్షణాల్లో విశ్వమంతా చేరిపోయే సోషల్ మీడియాలో ఫేస్ బుక్ పాత్ర అద్వితీయం. గడిచిన ఎన్నికల్లో ఫేస్ బుక్ ద్వారా విస్తృత ప్రచారమే సాగింది. అటువంటి ఫేస్‌బుక్‌లో అత్యంత ప్రముఖులైన ప్రపంచ నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకరుగా నిలిచారు. బర్సన్‌-మార్స్‌టెల్లర్‌ అధ్యయనంలో ఈ విషయం తేలింది. మోడీ వ్యక్తిగత ఫేస్‌బుక్‌ పేజీకి 3.1కోట్ల మందికిపైగా అభిమానులుంటే, అధికారిక ప్రధాని కార్యాలయం పేజీకి 1.01 కోట్ల మంది అభిమానులున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఈ విషయంలో అందరికన్నా ముందంజలో ఉన్నారు. బరాక్‌ ఒబామా క్యాంపైన్‌ పేజీలో 4.6 కోట్ల లైక్‌లున్నాయి. ఒబామా తర్వాతి స్థానం మోడీదే. పేజీలో పరస్పరం అభిప్రాయాలు పంచుకునే (ఇంటరాక్షన్‌) విషయంలో (పోస్ట్‌ లైక్‌లు, వ్యాఖ్యలు, పంచుకోవడాలు) మాత్రం ఒబామాకన్నా మోడీయే ముందంజలో ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడయింది. 2015లో మోడీ ఫేస్‌బుక్‌ ‘కమ్యూనిటీ’లో 20 కోట్లకు పైగా ఇంటరాక్షన్లు నమోదయ్యాయి. అంటే ఒబామాకు నమోదయిన వాటికన్నా ఇవి ఐదింతలు ఎక్కువ. కాగా ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని ర్యాంకింగుల్లో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ సహా పలువురు భారతీయ నేతలు ముందు వరుసలో ఉన్నారు.

English summary

Indian Prime Minister Narendra Modi was in second place in facebook followers after american president Obama.Modi fascebook page has 3.1 crore page likes while Obama has 4.6 crore likes