ఓంపురి మరణం వెనుక మోడీ హస్తం - ఓ ఛానల్ సంచలన కధనం

Modi is behind of Ompuri death....by a news channel

10:44 AM ON 10th January, 2017 By Mirchi Vilas

Modi is behind of Ompuri death....by a news channel

కొన్ని వినడానికి ఎబ్బెట్టుగా ఉంటాయి. కొన్ని ఆశ్చర్యం గొల్పుతాయి. మరికొన్ని విన్నాక నవ్వుకుంటాం. ఇంకొన్ని వింటే కొందరికి ఇంతకూ మించిన ఆలోచనలు ఎందుకు వస్తాయిలే అనుకుంటాం. ఇప్పుడు ఈ విషయం ఎలాంటిదో మీరే చెప్పండి చూద్దాం. ఇంతకీ విషయం ఏమంటే, విలక్షణ నటుడు ఓంపురి మృతి వెనుక ప్రధాని మోడీ, జాతీయ భద్రత సలహాదారు అజిత దోవల్ హస్తం ఉందట! ఓంపురికి ఒళ్లు తెలియనంత స్థాయిలో బలవంతంగా మద్యం తాగించి.. ఆయన ముఖం మీద దిండు వేసి నొక్కి చంపేశారట. ఈ పని చేసింది అజిత దోవల్ ప్రతినిధి అట. ఇలా చెప్పిందెవరో తెలుసా ? సాక్షాత్తూ పాకిస్థాన్ కు చెందిన బోల్ టీవీ అనే చానల్ ప్రసారం చేసిన ఐసే నహీ చలేగా అనే హాస్యాస్పద కథనమిది. ఓంపురి పాకిస్థానీ కళాకారులకు మద్దతుగా మాట్లాడటమే దారుణ హత్య కు కారణమని ఆ చానల్ కథనం పేర్కొంది. ఓంపురిని తనవద్దకు రావాల్సిందిగా దోవల్ ఇటీవలే ఆజ్ఞాపించారని, ఆయన అక్కడికి వెళ్లాక దుస్తులు ఊడదీసి, చితక్కొట్టారని.. ఉరీ అమరజవాను నితిన్ యాదవ్ గ్రామానికి వెళ్లి సైనికులపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారని ఆ ఛానెల్ వివరించింది. ఓంపురి మృతదేహంపై ఆయన్ను చంపిన వ్యక్తి ఆనవాళ్లు ఉన్నాయని.. దగ్గరుండి చూసినట్టు ఆ ఛానల్ రిపోర్ట్ చేసింది. అంతేకాదండోయ్ మోడీ తదుపరి లక్ష్యం పాక్ నటుడు ఫవాద్ ఖాన్ , బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అని పేర్కొంది. ఇంతకీ వారిద్దరూ ముస్లింలు కావడమేనట. వారెవ్వా ఏ కథ అల్లిందిరా అంటూ ఆ ఛానెల్ పై కామెంట్స్ పడుతున్నాయి. ఏదోరకంగా భారత్ ని బదనాం చేయడమే పాక్ ఉద్దేశ్యం అనే విషయం ఇంతకన్నా ఏం కావాలని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చూడండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

ఇది కూడా చూడండి: శ్రీరాముని కుమారులు కట్టించిన 4నగరాలు పాకిస్థాన్ లో ఉన్నాయా

ఇది కూడా చూడండి: మెగా బ్రదర్ పై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్లు

English summary

different story was created by a news channel that Mode and Ajith dhowal behind the death of Ompuri.