సంచలనం సృష్టిస్తున్న 'భీం' యాప్

Modi Launches New Mobile Payment App BHIM

10:55 AM ON 3rd January, 2017 By Mirchi Vilas

Modi Launches New Mobile Payment App BHIM

రూ 500, రూ 1000 నోట్లు రద్దు అనంతరం దేశంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే. ఇందుకోసం ప్రధాని నరేంద్రమోడీ భీమ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా విడుదల చేశారు. అయితే నాలుగు రోజుల కిందట విడుదల చేసిన ఈ అప్లికేషన్ 4.1 రేటింగ్ తో గూగుల్ ప్లేస్టోర్ లో దూసుకుపోతోంది. డిసెంబర్ 30న డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ అప్లికేషన్ ను విడుదల చేశారు. దీన్ని డౌన్ లోడ్ చేసుకోడం ద్వారా సామాన్యులు కూడా నగదు రహిత లావాదేవీలు జరుపుకొనే వీలుంది.

డౌన్ లోడ్ చేసుకున్న భీమ్ అప్లికేషన్ లో బ్యాంకు ఖాతా నంబరు, శాఖల వివరాలు నమోదు చేసుకోడంతో సింగిల్ విండోలో లావాదేవీలు చేసుకునేందుకు వీలుంది. సామాన్యులు సైతం తేలికగా ఉపయోగించడం కోసం స్మార్ట్ ఫోన్లకే పరిమితం కాకుండా అప్ డేటెడ్ ఫీచర్ ఫోన్లలోనూ ఈ అప్లికేషన్ పనిచేసే విధంగా రూపొందించారు. ప్రస్తుతం ఆపిల్ ఫోన్లు, ఐవోఎస్ ఫోన్లలో ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలో వీటిల్లో కూడా భీమ్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏకీకృత విధానంతో పాటు ఆధార్ నంబర్ అనుసంధానం చేసే యోచనలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏకీకృత చెల్లింపులు లేని వారికి కూడా ఆయా బ్యాంకుల ఐఎఫ్ ఎస్ సీ, ఎంఎంఐడీ కోడ్ల ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు జరుపుకోవచ్చు.

ఇక ఈ అప్లికేషన్ పరిధిలో అలహాబాద్ బ్యాంక్ , ఆంధ్రాబ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్ , కేథలిక్ సిరియన్ బ్యాంక్ , సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీబీ బ్యాంక్ , దేనా బ్యాంక్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,విజయా బ్యాంక్ ,ఫెడరల్ బ్యాంక్ ,హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ,ఐసీఐసీఐ బ్యాంక్ , ఐడీబీఐ బ్యాంక్ ,ఐడీఎఫ్ సీ బ్యాంక్ ,ఇండియన్ బ్యాంక్ , ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ , ఇండస్ ఇండ్ బ్యాంక్ ,సిండికేట్ బ్యాంక్ ,కర్నాటక బ్యాంక్ , కరూర్ వైశ్యా బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఆర్ బీఎల్ బ్యాంక్ ,ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ , పంజాబ్ నేషనల్ బ్యాంక్ ,స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ,సౌత్ ఇండియన్ బ్యాంక్ వున్నాయి.

ఇది కూడా చూడండి: మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కల్గించే వస్తువులు ఇవే ... వెంటనే తీసేయండి..!

ఇది కూడా చూడండి: రెగ్యులర్ శృంగారం లేకుంటే ఎన్ని సమస్యలో తెలుసుకోండి

ఇది కూడా చూడండి: 2017 లో మన జాతకం ఇలా ఉంటుందట

English summary

Modi Launches New Mobile Payment Application BHIM.