పువ్వుల్లో కాదు ... ముళ్ల మధ్యే ....

Modi Name To A Plant

12:08 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Modi Name To A Plant

సిక్కింలో అభివృద్ధి పరిచిన మూడు పుష్పజాతుల మొక్కలకు ప్రధాని మోడీ తో సహా మరో ఇద్దరి ప్రముఖుల పేర్లు పెట్టారు. సర్దార్‌ (సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌), దీన్‌దయాళ్‌ (దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ), నమో (నరేంద్రమోదీ) అనే పేర్లు పెట్టేసారు. అందులో రెండు పేర్లను స్వయంగా భారత ప్రధాని మోడీ సూచించారు. అయితే మరో మొక్కకు మోడీ పేరుని సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ ప్రతిపాదించారు.

సోమవారం సిక్కింలో జరిగిన వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ మొక్కల పేర్లపై స్పందించారు. ‘నన్ను పువ్వులంత సున్నితం కానీయకండి. నేను ముళ్ల మధ్య పెరిగాను. వాటి మధ్యే నా జీవనం కొనసాగుతోంది. విచారంలో ఉన్న ఓ వ్యక్తి కన్నీళ్లను పువ్వంత సున్నితంగా తుడిచేందుకు నా జీవితం ఉపయోగపడితే అంతకంటే నాకు ఇంకే సౌభాగ్యం కావాలి?’ అని వ్యాఖ్యానించారు. రెండు మొక్కలకు సర్దార్‌, దీన్‌దయాళ్‌ అనే పేర్లను తాను సూచిస్తే మూడో మొక్కకు తన పేరును సిక్కిం ముఖ్యమంత్రి చామ్లింగ్‌ ప్రతిపాదించినందుకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెల్పారు.

English summary

Assam government developed a new breed plants and Assam Cheif Minister Pawankumar Chamling Named plants as ardar Vallabhai Patel,Dindayal Upaadhyaya and Narendra modi names