మోడీ పర్యటన కూడా మేజిక్కేనా

Modi Photos Photoshopped By PIB

03:35 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Modi Photos Photoshopped By PIB

గడచిన గురువారం, భారత ప్రధాని నరేంద్ర మోడి చెన్నై వరద ప్రాంతాలను విమానం ద్వారా ఎరియల్‌ సర్వే నిర్వహించారు. అనేక విధాలుగా నష్ట పోయిన చెన్నై కు తక్షణ సాయంగా 1000 కోట్లను విడుదల చేసారు . ఈ ఎరియల్‌ సర్వేకు చెందిన వివిధ ఫోటోలను ప్రెస్‌ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) వారు విడుదల చేసారు . ఈ ఫోటోలను పిఐబీ వారు ట్విట్టర్‌లో పెట్టగా అవి వివాదస్పదమయ్యాయి. ప్రధాని మోడి విమానం కిటికి లోనుండి చూస్తున్నట్లుగా ఉన్న ఫోటోలను ఫోటోషాష్‌ సహాయంతో చెన్నై లోని ఇళ్ళను, పరిసరప్రాంతాలను విమానంలో నుండి అతి దగ్గరగా చూస్తున్నట్లుగా మార్చి ట్విట్టర్లో పెట్టారు. ఐతే దానికి కొంత సేపటి ముందే మోడి మబ్బులలో నుండి విశాలమైన ప్రాంతాన్నిచూస్తున్నట్లుగా ఉన్న ఫోటోలను ట్విట్టర్ లో పెట్టారు .

ఈ ఫోటోలపై పలువురు ట్విట్టర్లో స్పందిస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పిఐబి సంస్ధ ఇలా ఫోటోషాప్ చేసిన ఫోటోలను పెట్టడం ఎంటని ప్రశ్నించారు. కొందరైతే ఫోటోలను గూర్చి వ్యగ్యంగా మాట్లాడుతూ ట్వీట్‌లు చేసారు. దీంతో ప్రెస్‌ ఇప్ఫర్మేషన్‌ బుర్యో (పిఐబి) వారు తమ ట్విట్టర్లో నుండి ఆ ఫోటోలను తొలగించింది. అయితే తాము చేసిన ఈ పోరపాటు చర్యకు సంభందించి పిఐబి వారు ఎటువంటి ప్రకటన చెయ్యకపోవడం విశేషం.

English summary

Press Information Bureau (PIB) tweeted the photoshopped images of prime minister narendra modi arieal survey in tamilnadu. People protested the photos of PIB on twitter