ప్రధాని మోడీ ఆస్తి కోటిన్నరే..

Modi property Was Just One And Half Crores

10:43 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Modi property Was Just One And Half Crores

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఆస్తుల విలువను వెల్లడించారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. కోటీ 41 లక్షలు. ఆయన చేతిలో వున్న నగదు రూ. 4,700. ప్రధాని కార్యాలయం తాజాగా విడుదల చేసిన ఆయన ఆస్తి వివరాలివి. ఈ ఆస్తిలో కూడా ప్రధానమైన వాటా నివాస భవనమే 13 ఏళ్ళ క్రితం దీన్ని కొనుగోలు చేశారు. 2014 ఆగస్టు 18న ఆస్తులు వెల్లడించిన తర్వాత 2015 మార్చి 31 నాటికి మధ్య కాలంలో ఆయన ఆస్తులు కోటీ 26 లక్షల నుండి కోటీ 41లక్షలకు పెరిగాయి. ఇందులో స్థిర చరాస్తులు రెండూ వున్నాయి. మోడీకి మోటారు వాహనాలు, విమానాలు, ఓడలు వంటివేమీ లేవు. ఆయనకు గుజరాత్‌లోనే బ్యాంక్‌ ఖాతా వుంది. ఢిల్లీలో లేదు. ఆయనకు ఎలాంటి రుణాలు లేవు. ఆయనకు వున్నదల్లా నాలుగు ఉంగరాలు మాత్రమే వాటి విలువ లక్షా 19 వేలు. మోడీ పెట్టుబడుల్లో రూ. 20 వేల విలువ చేసే ఎల్‌ అండ్‌ టి ఇన్‌ఫ్రా బాండ్లు(పన్ను ఆదా) ఉన్నాయి. రూ.5.45 లక్షల విలువ చేసే నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లు, రూ. 1.99 లక్షల విలువైన జీవిత బీమా పాలసీలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ. 41.15 లక్షలు. గాంధీనగర్‌లో ఉన్న ఇంట్లో నాల్గవ వంతు మోడీదే. బ్యాంక్‌ డిపాజిట్లు రూ.94,093 ఉన్నాయి. పొలం గానీ, వాణిజ్యపరమైన స్థలాలు కానీ ఆయనకు లేవు.

English summary

Indian Prime Minister Narendra Modi announced his total Assets.According to the latest details of his assets said by the Prime Minister's Office, Narendra Modi had total 'cash in hand' of just Rs 4,700 at the end of the last fiscal, down from Rs 38,700 disclosed mid-fiscal as on August 18, 2014. The total value of Modi's movable and immovable assets during this period has grown from Rs 1,26,12,288 to Rs 1,41,14,893 as on March 31, 2015.