నేతాజీ రహస్య ఫైల్స్ ను బహిర్గతం చేసిన ప్రధాని మోదీ

Modi Reveals Netaji Secret Files

04:20 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Modi Reveals  Netaji Secret Files

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆజాద్ హింద్ పౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించిన రహస్య ఫైళ్లను శనివారం ప్రధాని నరేంద్రమోదీ బహిర్గతం చేశారు. సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబసభ్యుల సమక్షంలో భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం(ఎన్‌ఏఐ)లో పత్రాలు విడుదల చేశారు. నేతాజీ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన దస్త్రాలను చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. నేతాజీ జీవితానికి సంబంధించిన 100 రహస్య ఫైళ్లను డిజిటల్‌ ప్రతుల రూపంలో బహిర్గతం చేశారు. ఈ కార్యక్రమానికి 12 మంది నేతాజీ కుటుంబసభ్యులు హాజరయ్యారు. 70 ఏళ్ల క్రితం బోస్‌ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆయన గురించి మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. నేతాజీ మరణంపై గతంలో వేసిన రెండు దర్యాప్తు కమిషన్‌లు ఆయన తైపీలో 1945, ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలిపాయి. కానీ ఆయన కుటుంబసభ్యులు, మరికొందరు ఈ విషయాన్ని అంగీకరించలేదు. ఆయన గురించి పూర్తి సమాచారం కోసం దస్త్రాలను బహిర్గతం చేయాలని కోరాయి.

English summary

Today was 119th birth anniversary of Netaji Subhas Chandra Bose. On the occassion of this Prime Minister Narendra Modi today he revealed 100 secret files on the freedom fighter whose disappearance 70 years ago remains a mystery.