రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన  మోడీ 

Modi Says Birthday Wishes To Pranab Mukheerjee

05:51 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Modi Says Birthday Wishes To Pranab Mukheerjee

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రణబ్ ముఖర్జీని దేశానికి వెలకట్టలేని సంపదగా ఆయన ఆభివర్ణించారు. రాష్ట్రపతి ప్రణబ్ ఈరోజు తన 81వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ తన సందేశాన్ని పోస్టు చేశారు, ప్రజా జీవితంలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

ప్రణబ్‌ను వివేకం, మేధస్సు సమపాళ్లు కలిగిన వ్యక్తిగా ఆయన పేర్కొన్నారు. ప్రణబ్ గౌరవప్రదమైన నాయకుడని, ఆయన దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోడీ కొనియాడారు. ఈ సందర్భంగా 'ప్రెసిడెంటల్ రీట్రేట్స్' పుస్తకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ప్రణబ్ ప్రసంగాల సంపుటి-3ను కూడా ప్రధాని మోడీ విడుదల చేశారు. కాగా రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాజేంద్ర ప్రసాద్ నవోదయ విద్యాలయ పాఠశాలలో 'ఉమాంగ్-2015' వేడుకలను ప్రణబ్ ప్రారంభించారు. ఈ పాఠశాలను సౌరశక్తితో నడిచే హరిత విద్యాలయంగా ప్రకటించారు. దీంతో పాటు 'రాష్ట్రపతి భవన్‌లో జీవితం' పేరిట పిల్లల కోసం ప్రత్యేక విభాగాన్ని ఆవిష్కరించారు. ఏడు నుంచి 15 ఏళ్ల వయసున్న బాలల కోసం దీనిని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి గురించిన వివిధ అంశాలను సరళమైన భాషలో దీని ద్వారా చిన్నారులకు అందుబాటులో ఉంచారు. కాగా ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధి రాష్ట్రపతి భవన్ కి వెళ్లి ప్రణబ్ కి పుష్ప గుచ్చం అందజేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెల్పారు.

English summary

Indian Prime Minister Narendra Modi Says Birthdays wishes to President Of India Pranab Mukhwerjee