పవన్ బర్త్ డేకి మోడీ గిఫ్ట్ రెడీ చేస్తున్నారట!

Modi special gift for Pawan Kalyan's Birthday special

11:43 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Modi special gift for Pawan Kalyan's Birthday special

ఇటీవల తిరుపతి సభతో మరోసారి ఢిల్లీ వరకూ తన వాణి వినిపించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే ప్రస్తుతం టాక్ నడుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆయన సంధించిన బాణం, పలువురు నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఇంకా చర్చ నడుస్తోంది. ఇంతలోనే పవన్ పుట్టినరోజు కూడా రానే వచ్చింది. శుక్రవారం పవన్ పుట్టినరోజు సందర్బంగా వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు ఘనంగా జరుపుకోనున్నారు. సాధారణంగా పవన్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటాడు. అలాగే ఈ సారికూడా తన పుట్టినరోజు నాడు అభిమానులకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ తిరుపతిలో బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడంతో కేంద్రంలో కదలిక వచ్చినట్లే కనిపిస్తోంది. గత రెండురోజులుగా కేంద్రం లో ఏపీ కి ప్రత్యేక హోదా, ప్యాకేజి విషయం లో చర్చలు జరుగుతున్నాయి. కాగా ఏపీకి ప్రత్యేక హోదా విషయం లో ఇబ్బందులు తలెత్తుతున్నందువల్ల భారీ ప్యాకేజి ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్యాకేజి ప్రకటనను సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కానుకగా ప్రకటించే అవకాశం ఉందంటూ ప్రచారం జరగడం విశేషం. పవన్ ను 2019 ఎన్నికలనాటికి తమవైపుకు తిప్పుకునేందుకు మోడీ ప్రయత్నిస్తునాడంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: ఆ నాలుగు చోట్ల సెల్‌ఫోన్‌ పెట్టుకొంటే ఇక అంతే

ఇది కూడా చూడండి: జబర్ధస్త్ వినోదిని గురించి తెలిస్తే షాకవుతారు!

ఇది కూడా చూడండి: ఒక్కడినే ప్రేమించిన తల్లీకూతుళ్ళు! ఆ తరువాత ఏమైందో తెలుసా?

English summary

Power Star Pawan Kalyan is going to get the gift from PM Modi what he has asked?