నా పై కుట్ర పన్నుతున్నారు

Modi Speech at Krishak Samavesh in Odisha

10:02 AM ON 22nd February, 2016 By Mirchi Vilas

Modi Speech at Krishak Samavesh in Odisha

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల దేశంలో తన పై వస్తున్న విమర్శల నేపధ్యంలో తీవ్రంగా స్పందించారు. సర్కార్ ని కూల్చాలని కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఇలాంటివాటికి తలొగ్గేది లేదని ఆయన తేల్చిచెప్పారు.. ఒడిసాలోని బర్‌గఢ్‌లో ఆదివారం నిర్వహించిన రైతుసభలో ఆయన ప్రపంగించారు. ఎవరి పేర్లూ ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చారు. రైతుల సంక్షేమానికి తన ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్‌ స్కీం, పంటల బీమా పథకం, భూసార కార్డు పథకం వంటి కార్యక్రమాలను మోడీ గుర్తుచేశారు. ‘మీ భూమిలో మూడో వంతు భాగంలో చెట్లు పెంచండి.. అవి పెరిగాక విక్రయిస్తే మీ కుమార్తె పెళ్లి ఖర్చులకు ఉపకరించవచ్చు. ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే ఇలాంటివి చేయాలని సూచించారు.

‘ఇటీవల కొందరు నా పై నిరంతరం దాడి చేయడం మీరు (ప్రజలు) చూస్తున్నారు. ఓ చాయ్‌వాలా ప్రధాని కావడాన్ని వారు సహించలేక పోతున్నారు. ముఖ్యంగా నేను తీసుకున్న కొన్ని చర్యలతో వారికి సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా వేపగుజ్జు పూసిన యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం. రైతుల్ని దోపిడీ చేస్తున్న రసాయన కర్మాగారాలు నా చర్యను సహిస్తాయా? విదేశాల నుంచి నిధులు తీసుకుంటున్న స్వచ్చంద సంస్థల(ఎన్జీవోలు) ను నా ప్రభుత్వం ఆ నిధులకు జమాఖర్చులు అడిగింది. అంతే.. మనల్ని లెక్కలు అడుగుతున్నాడు... ‘మోదీ కో మారో.. మోదీ కో మారో’ అని కేకలు వేస్తున్నారు. నన్ను అంతం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. కానీ వాళ్లు ఏం చేసినా ప్రజలు అప్పగించిన బాధ్యత నుంచి వైదొలగను. దేశాన్ని దోచుకోవడాన్ని, నాశనం చేయడాన్ని అనుమతించను.’ అంటూ ప్రధాని మోడీ ఘాటుగా స్పందించారు.

English summary