నవరాత్రి మినరల్ వాటర్ ఖర్చు రు. 10 కోట్లు .. మోడీయా మజాకా

Modi Spent 10 Crores For Water Bottles

11:16 AM ON 12th December, 2016 By Mirchi Vilas

Modi Spent 10 Crores For Water Bottles

పెద్దనోట్లు రద్దు చేసి ప్రధాని నరేంద్ర మోడీ బాగా ఖర్చు మనిషి. బట్టల మీదే పెట్టే ఖర్చు భారీ. తాగే మినరల్ వాటర్ మీద పెట్టే ఖర్చు కూడా భారీయే.

దేశం కోసం, దేశ ప్రజల బాగోగులకు అహర్నిశలు పనిచేస్తున్న మన ప్రియతమ ప్రధాని మంచినీళ్ల ఖర్చు కూడా భారీగా కోట్లలోనే ఉందని ఇపుడు వెల్లడయింది.

గత ఏడాది నవరాత్రి సందర్భంగా ఆయన ఉపవాసాలున్న సంగతితెలిసిందే. చివరకు గత సెప్టెంబర్ నెలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామో భోజనానికి పిలిస్తే కూడా ఆయన ఉపవాసం కారణంగా కేవలం ఒక గ్లాసెడు వేన్నీళ్లు సేవించి చర్చల్లో పాల్గొన్నారు.

ఇలా ఆయన తాగిన మంచి నీళ్ల ఖర్చు అక్షరాల పది కోట్లరుపాయలట. నవరాత్రి సందర్భంగా ఆయన ఉపవాసాలుంటారు. కేవలం పచ్చి మంచి నీళ్లు మాత్రమే తాగుతారు. కాకపోతే, మధ్య మధ్య పళ్లరసంతీసుకుంటారు.

ఆయన తాగే మంచినీళ్ల ఖర్చు సమాచారం చట్టం పుణ్యాన దేశ ప్రజలకు తెలిసింది. ఆర్ టి ఐ చట్టం కింద ‘జుంటా కా రిపోర్టర్’ అడిగిన ప్రశ్నకు ప్రధాని కార్యాలయం ఈ సమాచారం అందించింది. కాకపోతే, నీళ్లతో పాటు ఈ పదికోట్లతో పళ్ల రసాలుకూడా కొన్నారని కూడా అధికారులు చెప్పారు.

అధికారం చేపట్టిన తర్వాత నవరాత్రి సందర్భాంగా ప్రధాని తాగిన మినరల్ వాటర్ కు, పళ్ల రసాలకు ఎంత ఖర్చయిందో చెప్పాలని ‘జుంటా కా రిపోర్టర్’ అడిగిందట. ఇప్పుడు ఇది సంచలనంగా మారి నెట్ లో హల్ చల్ అవుతోంది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి: ఈ హీరోయిన్ కు విమానంలో కూడా లైంగిక వేధింపులు

ఇవి కూడా చదవండి: ఐటీ దాడుల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు... మరో రూ.106 కోట్లు స్వాధీనం....

English summary

Indian Prime Minister Narendra Modi was made fasting during Navatri and one of the Journalist asked the total expenses that Narendra Modi spent for Water Bottles and PMO replied that the total expenses was 10 crore.