మాజీ గవర్నర్  రామారావుకి నివాళి 

Modi Tribute To BJP Senior Leader Ramarao

01:02 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Modi Tribute To BJP Senior Leader Ramarao

అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన బిజెపి సీనియర్‌ నేత, సిక్కిం మాజీ గవర్నర్‌ వి.రామారావు(81) పార్థివదేహానికి పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు నివాళులర్పించారు. బీజేపీ నేత, సిక్కిం మాజీ గవర్నర్ రామారావు కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఈయన.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.2002లో సిక్కిం గవర్నర్‌గా పనిచేసిన ఆయన బీజేపీకి విశేష సేవలందించారు. మచిలీపట్నానికి చెందిన రామారావు 1935 డిసెంబర్ 12న జన్మించారు. జనసంఘ్ కాలంలో పార్టీలో చేరిన ఈయన అంకితభావంతో పనిచేసారు. శాసనమండలికి ఎన్నికై , ప్రజా సమస్యలపై పోరాటం చేసారు. ఆయన మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

గవర్నర్‌ నరసింహన్‌ బంజారాహిల్స్‌లోని రామారావు నివాసానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పలువురు ప్రముఖులు ఆయన సేవలు కొనియాడారు. కాంగ్రెస్ నేత , రాజ్యసభ సభ్యులు డాక్టర్ కెవిపి రామచంద్రరావు తదితరులు నివాళులర్పించారు.

మోదీ సంతాపం

కాగా వి.రామారావు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన పార్టీకి, దేశానికి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.

English summary

Sikkim Ex-Governer And BJP senior leader V.Rama Rao died on this sunday.Soo many celebrities including Prime Minister of India Narendra Modi also says his tribute to N.Ramarao