ప్రధాని మోడీ నన్ను చంపించాలని చూస్తున్నారు

Modi Trying To Kill Me Says Aravind Kejriwal

11:07 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Modi Trying To Kill Me Says Aravind Kejriwal

బిజెపికి, ఆమ్ ఆద్మీ పార్టీకి పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. అందునా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి - ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్సలు పడిచావదు. ఎప్పుడూ ప్రధానిపై కేజ్రీ విరుచుకు పడుతూనే ఉంటారు. తాజాగా మోడీ పై ఢిల్లీ సీఎం సంచలన ఆరోపణలు చేశారు. ఈ దఫా కేజ్రీవాల్ రాజకీయ ఆరోపణలు కాకుండా ఏకంగా హత్య అనే అంశం ఎత్తుకుని తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలంగా మారింది. ఇటీవల పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాప్రతినిధులు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు అరెస్టులను ప్రస్తావిస్తూ, ఆప్ నాయకుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు కేజ్రివాల్ వీడియో సందేశం విడుదల చేశారు.

ఆ వీడియో మెసేజ్ లో కేజ్రీ తన సందేశాన్ని వినిపిస్తూ...తన పార్టీ మీద ఉన్న కక్ష్యతో ప్రధాని మోడీ తనను చంపిస్తాడేమో అని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ ఎమ్మెల్యేలపై మోదీ ప్రతీకారం తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. ''మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందనుకోవడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలా తీవ్ర నిరాశ - నిస్పృహలో ఉన్నారు. ఆయన నన్ను చంపించినా ఆశ్చర్యం లేదు'' అని కేజ్రీ తీవ్రంగా ఆరోపించారు. అందుకే ప్రతి ఆప్ కార్యకర్త జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతీకారంతో ఉన్న మోదీ ఆప్ కార్యకర్తలను చంపినా చంపిస్తారనే సందేహాలు వెలువడుతున్నాయని కేజ్రీవాల్ సూచించారు. అయితే ప్రాణాలు పోతాయని భయం ఉన్న వాళ్లు పార్టీని వదిలి వెళ్లాలని లేదంటే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియోలో కేజ్రీ ఈ వ్యాఖ్యలు చేయడం ఇపుడు కలకలం సృష్టిస్తోంది. మరి దీనిపై కమల నాథులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:వామ్మో.. షుగర్ ఫ్యాక్టరీలో వెయ్యి విషనాగులు(వీడియో)

ఇవి కూడా చదవండి:అనుష్క ఆ గేమ్ ఆడేస్తోంది బాబోయ్

English summary

Aam Admi Party Chief and Delhi Chief Minister Aravind Kejriwal says that he and his party members have threat from BJP and Narendra Modi. He recorded a video on this and he posted in Youtube, Now this video was going viral over the internet.