గాంధీ కన్నా మోడీ పెద్ద బ్రాండ్ ... మంత్రి వ్యాఖ్యలపై దుమారం

Modi Was Big Brand Than Gandhi Says Haryana Minister

11:59 AM ON 17th January, 2017 By Mirchi Vilas

Modi Was Big Brand Than Gandhi Says Haryana Minister

ప్రధాని మోడీ ఓ పక్క కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, అభివృద్ధి మంత్రంతో ముందుకు వెడుతుంటే,కేంద్ర మంత్రుల్లో కొందరు అలాగే ఆయా రాష్ట్రాల్లోని బిజెపి మంత్రులు , నేతలు చేస్తున్న విమర్శలు షాకిస్తున్నాయి. వివాదం అలుముకుంటోంది. తాజాగా మహాత్మాగాంధీ కన్నా ప్రధాని నరేంద్ర మోడీయే మంచి బ్రాండ్ ’ అని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఖాదీపై గాంధీ పేరుకేమీ పేటెంట్ లేదు. ఖాదీకి గాంధీ పేరును లింకు చేసినప్పటి నుంచే పరిశ్రమ పతనమై పోయింది. గాంధీ బొమ్మను కరెన్సీ నోట్లపై వేసినప్పటి నుంచి రూపాయి విలువ తగ్గడమే కానీ పెరగడం లేదు’’ అని విజ్ వ్యాఖ్యానించారు. ఖాదీ, కుటీర పరిశ్రమల కమిషన్ తాజా కేలండర్ లో గాంధీకి బదులుగా మోడీ ఫొటో వేయడంపై వ్యక్తమైన విమర్శలకు మంత్రి స్పందించారు. ఖాదీ వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా గాంధీ స్థానంలో మోడీని పెట్టడం సరైన నిర్ణయమని చెప్పారు. కనీసం దానివల్ల ఖాదీ అమ్మకాలు పెరుగుతాయన్నారు. హర్యానా మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు. హిట్లర్ , ముస్సోలినీ కూడా శక్తివంతమైన బ్రాండ్లేనని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ మీడియా సెల్ ముఖ్య ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ, గాంధీని చంపగలిగారు. ఆయన ఫొటోలు తీసేయగలిగారు. దేశ ప్రజల గుండెల్లోంచి ఆయన్ను తొలగించలేరు’’ అన్నారు.

మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ మాట్లాడుతూ, హర్యానా మంత్రి హైకమాండ్ చెప్పినట్లు వింటున్నారని, ఆర్ ఎ్ సఎస్ భాష మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. విజ్ వ్యాఖ్యలను ఖండించింది. వ్యాఖ్యలు మంత్రి వ్యక్తిగతమని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీకాంత శర్మ అన్నారు. విజ్ తో విభేదాలున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. పరిస్థితి తనకు ఎదురు తిరిగిందని గ్రహించిన విజ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. దీంతో ఈ వివాదానికి తెరపడిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: ములాయం సైకిలు పోయే - కోలుకోలేని దెబ్బ

ఇవి కూడా చదవండి: వామ్మో ... యువతి కడుపులో 150 పాములు

English summary

Haryana Minister Anil Vij made some controversial comments on Gandhi ji by saying that Modi was bigger brand than Mahatma Gandhi. He said that Khadi colthes were in loss from when Mahatma Gandhi was made its brand and he said that Indian rupee was loosing its value from when Ganghi photo was printed on currency notes.