ప్రధానిమోదీ బ్రిటన్ పర్యటన

Modi’s Britain Tour

05:34 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Modi’s Britain Tour

భారత ప్రధాని నరేంద్రమోదీ బ్రిటన్ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం లండన్ చేరుకున్నారు. హీత్రో విమానాశ్రయంలో మోదీకి బ్రిటన్ ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సెయింట్ జేమ్స్ కోర్టు హోటల్ కు చేరుకున్నారు. ఆ హోటల్ వద్ద బ్రిటన్ ప్రభుత్వం భారీ భ్రదతను ఏర్పాటు చేసింది. సాయంత్రం బ్రిటన్ ప్రధాని కామెరిన్ తో మోదీ సమావేశం కానున్నారు. భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పాందాలపై చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి చేపట్టాల్సిన చర్యలపై ఇద్దరు అగ్రనేతలు ఒక నిర్ణయానికి రానున్నారు. ఈ భేటీలో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం వెంబ్లీ స్టేడియంలో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రాత్రి 9.20 గంటలకు బ్రిటన్ పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. శనివారం వరకు మోదీ పర్యటన సాగనుంది.

English summary

Modi’s Britain Tour