క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకున్న ఫోటో ... నెటిజన్ల మండిపాటు

Mohammad Shami was trolled in social media for keeping his wife photo

10:48 AM ON 27th December, 2016 By Mirchi Vilas

Mohammad Shami was trolled in social media for keeping his wife photo

కొన్ని అంశాలు వివాదం సృష్టిస్తాయి. మరికొన్ని వివాదం కోసం పుడతాయి. ఇక సినీ తారలు, క్రికెటర్ల కు సంబంధించిన వార్తలైతే, యమజోరుగా షికారు చేస్తాయి. ఎందుకంటే సెలబ్రిటీల రూటే వేరు కదా. ఇదంతా ఎందుకంటే, భారత క్రికెటర్ ముహమ్మద్ షమీ హిజాబ్ తాను లేకుండా స్లీవ్ లెస్ గౌను ధరించిన భార్య ఫోటో పెట్టడం వివాదంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అధికారిక ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీల్లో తన భార్య హాసిన్ జహాన్ మెరూన్ రంగు స్లీవ్ లెస్ గౌను ధరించిన ఫోటోను ఈ నెల 23న పెట్టాడు. హిజాబ్ లేకుండా భార్య ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడమేమిటని పలువురు ముస్లిమ్ లు షమీపై విమర్శల వర్షం కురిపించారు.

‘షమీ నీవు ముస్లిమ్ వేనా...భార్యను ఎలా ఉంచాలో నీకు తెలియదా...ఇలా ఫోటో పెట్టడం మంచిది కాదు’ అంటూ పలువురు షమీకి హితవు పలికారు. ‘నీకు సిగ్గు లేదా ఒక ముస్లిమ్ భార్యను ఎలా పరదా వెనుక ఉంచాలో నేర్చుకో...’అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.‘నీ భార్యను ఇస్లామ్ సంప్రదాయం ప్రకారం నడుచుకునేలా చూడు షమీ అన్న’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘నీ భార్య ముస్లిమ్ లేక ఇతర మతస్థురాలా...కొంచెం దేవుడికి భయపడు’ అంటూ మరో నెటిజన్ పోస్టు చేశాడు.

కాగా మోకాలి గాయం కారణంగా ఇంగ్లాండుతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లకు దూరంగా ఉన్న షమి ప్రస్థుతం చికిత్స పొందుతున్నాడు. దీనిపై మరో క్రికెటర్ ముహమ్మద్ కైఫ్ షమీకి మద్ధతుగా నిలిచాడు. ‘‘షమీపై వ్యాఖ్యలు చూసి సిగ్గుపడుతున్నా... దేశంలో చాలా సమస్యలున్నాయి’’ అని కైఫ్ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు దుస్తులు ధరిస్తారని, మీ పని మీరు చేసుకోండంటూ మరికొందరు నెటిజన్లు షమీకి బాసటగా నిలిచారు.

ఫేస్ బుక్ లో షమీపై ఆగ్రహజ్వాలలు వక్తమవ్వగా, ట్విట్టర్ లో మాత్రం మన భారతీయ ముస్లిమ్ లు మీలాగే ఉండాలని ఎక్కువమంది అభిలషించారు. మొత్తం మీద షమీ పెట్టిన స్లీవ్ లెస్ ఫోటో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. గతంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కురచ దుస్తులు ధరించినపుడు కూడా 2005లో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి: షాకింగ్ న్యూస్: గర్భిణీ మెదడులో మార్పులు!

ఇవి కూడా చదవండి:తాగుబోతుల అలవాటు పోగొట్టేందుకు అద్భుత ఐడియా

English summary

Indian Fast Bowler Mohammad Shami was being critisised in Social media for keeping his wife photo without him. So many people was trolled and critisised Shami and some were supported Shami.