యాక్సిడెంట్ లో పురుషాంగాన్ని కోల్పోయాడు... ఆ పై 70 లక్షలు ఖర్చు పెట్టి....

Mohammed Abad gets Bionic Penis with hundreds of surgerys

12:23 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Mohammed Abad gets Bionic Penis with hundreds of surgerys

మొహమ్మద్ అబాద్ (44) బ్రిటన్ లోని ఎడిన్ బర్డ్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతను ఆరేళ్ళ వయసులో ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బంపర్‌లో చిక్కుకున్న అతన్ని కారు దాదాపు అరకిలోమీటర్ వరకు ఈడ్చుకుపోయింది. ఆ ప్రమాదంలో మొహమ్మద్ అబాద్ పురుషాంగంతో పాటు ఒక వృషణాన్ని కూడా కోల్పోయాడు. అతికష్టం మీద వైద్యులు అతన్ని బతికించగలిగారు. అయితే మొహమ్మద్ అప్పటి నుండి కూర్చునే మూత్రవిసర్జన చేసేవాడు. తోటి విద్యార్ధుల వేధింపులు భరించలేక స్కూల్ మానేసి చిన్న చిన్న పనులు చేస్తూ కొంచెం డబ్బులు కూడబెట్టాడు.

అయితే మొహమ్మద్ తనకూ ఓ కుటుబం ఉండాలని తపించేవాడు. ఇంక ధైర్యం చేసి లండన్ యూనివర్సిటీ హాస్పటల్లో వరుసగా వందల ఆపరేషన్లు చేయించుకుని బయోనిక్ పురుషాంగాన్ని పొందాడు. దాదాపు మూడేళ్లు నుండి ఆపరేషన్లు చెయ్యడం మొదలు పెడితే... 2012 నాటికి అబాద్‌కు చివరి ఆపరేషన్ పూర్తయింది. అయితే అబాద్ తన సర్జరీలు పూర్తికాకముందే తన పరిస్థితిని దాచిపెట్టి ఓ మహిళను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే శోభనం రోజు రాత్రి ఆ మహిళ అతన్ని వదిలి వెళ్లిపోయింది. అయితే ఆపరేషన్ పూర్తయ్యాక తన శృంగార సామర్ధ్యాన్ని టెస్ట్ చేసుకునేందుకు ఒక వేశ్యను కలిశాడు.

ఆమెతో సెక్స్ చేసేటప్పుడు అబాద్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దానికి కారణం తన పురుషాంగం పెద్దది కావటమే అని తెలుసుకున్న డాక్టర్లు దాని పొడవును తగ్గించాలని నిర్ణయించుకున్నారు.

కృత్రిమ పురుషాంగం పనిచేసే విధానం:

ఏమైనా ప్రమాదాలు సంభవించినప్పుడు గానీ మరే ఇతర కారణాలు వల్ల గానీ పురుషాంగం తెగిపోయిన వారికి ఆ స్థానంలో చనిపోయిన వ్యక్తుల పురుషాంగాన్ని ఇంప్లాంట్ చేసి అతికిస్తారు. అయితే అబాద్ పరిస్థితి వేరు. ఎందుకంటే అతను పురుషాంగంతో పాటు వృషణం కూడా కోల్పోవడం వల్ల డాక్టర్లు మరింత కష్టపడాల్సి వచ్చింది. రసాయన ద్రావణాలు నింపిన రెండు ట్యూబ్‌లను ఒక్కటిగా చేర్చి, శరీరంలో మరో ప్రదేశం నుంచి సేకరించే కొవ్వు, చర్మాన్ని ఆ ట్యూబ్‌లకు అతికిస్తారు. అయితే అబాద్‌కు ఎడమచేతి పై చర్మాన్ని అతికించారు.

రెండు మూడు అంగుళాలుండే వేరొక గుండ్రటి ట్యూబ్‌లో అంగస్తంభనకు ఉపకరించే జీవనపదార్ధాలు, రసాయనాలను నింపి కడుపులో ఒక భాగంలో ఉంచుతారు. దాని నుంచి ఒక సన్నటి పైప్‌ను పురుషాంగానికి కనెక్ట్ చేస్తారు. అవసరమైనప్పుడు ఆన్, ఆఫ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు చెయ్యబోయే ఆపరేషన్ ద్వారా వీర్యకణాలు (మిగిలిన ఒక వృషణంలో తయారైనవి) సులువుగా బయటకి వచ్చే వీలుంటుందని వైద్యులు చెప్పారని, ఎప్పటికైనా ఒక బిడ్డకు తండ్రి కావటమే తన జీవితాశయమని అబాద్ చెపుతున్నాడు. బయోనిక్ పెనిస్ కోసం అబాద్ సుమారు 70 వేల పౌండ్లు (70 లక్షల రూపాయలు) ఖర్చు పెట్టాడు.

English summary

Mohammed Abad gets Bionic Penis with hundreds of surgerys