ప్రమాదం నుంచి బయటపడ్డాడు.. తరువాత 6 కోట్లు గెలుచుకున్నాడు!

Mohammed Bashir Abdul won 6 crores lottery

04:51 PM ON 11th August, 2016 By Mirchi Vilas

Mohammed Bashir Abdul won 6 crores lottery

మనం ఎన్నో సార్లు అదృష్టం అనే మాట వింటుంటాం. అయితే కొంత మందికి ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాదు. అలాంటి వాళ్లకి అసలు అదృష్టం అనే ఏంటో తెలీదు.. కానీ ఇప్పుడు మేము చెప్పబోయేది వింటే అదృష్టమంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు! ఆ వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తికి గడచిన వారంలో రెండు అదృష్టాలు కలిసి వచ్చాయి. గత బుధవారం దుబాయ్ లో జరిగిన ఎమిరేట్స్ విమానం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆయనకు ఆ దేశ లాటరీ కూడా వరించింది. కేరళకు చెందిన 62 ఏళ్ళ మెహమ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదర్ 37 ఏళ్ళుగా దుబాయ్ లోని కార్ల సంస్థలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఈద్ సందర్భంగా దుబాయ్ లాటరీ కొనుగోలు చేసి కేరళ వచ్చి కుటుంబంతో సంతోషంగా గడిపారు.

గత వారం అబ్దుల్ తిరిగి దుబాయ్ వెళ్లగా ఆయన ప్రయాణించిన ఎమిరేట్స్ విమానం విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయ్యింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విచిత్రంగా అందరూ విమానం దిగగానే అది కాలిబూడిదయ్యింది. ఈ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మెహమ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదర్ ను మరో అదృష్టం తలుపు తట్టింది. మంగళవారం తీసిన దుబాయ్ లాటరీ డ్రాలో మిలియన్ అమెరికా డాలర్లు ఆయన గెలుచుకున్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు ఆరున్నర కోట్లు. ఈ లాటరీ కోసమే దేవుడు నన్ను బ్రతికించాడు అని మహమ్మద్ చెప్పారు. అంతే కాదు తనను ప్రాణాలతో బతికించిన దేవుడు పేదలకు సేవ చేసేందుకు మరో అవకాశం కల్పించినట్లు అబ్దుల్ ఖాదర్ సంతోషం వ్యక్తం చేశారు. తన శక్తి ఉన్నంత వరకు ఉద్యోగం చేస్తానని, ఎలాంటి పన్నులు లేని లాటరీ సొమ్మును కేరళకు చెందిన పేద పిల్లల చదువు, వైద్య సేవలకు వినియోగిస్తానని చెప్పి తన గొప్ప మనసుని చాటి చెప్పారు.

English summary

Mohammed Bashir Abdul won 6 crores lottery