వజ్రోత్సవాల కంటే గ్రాండ్ గా 'మోహన్ బాబు 40 ఇయర్స్' ఈవెంట్

Mohan Babu 40 years event getting bigger than Vajrotsavam

12:12 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Mohan Babu 40 years event getting bigger than Vajrotsavam

టాలీవుడ్ లో ఓ బ్రహ్మాండమైన ఫంక్షన్ జరగబోతోంది. పైగా భారీ ఎత్తున చేస్తారట. ఏస్థాయిలో అంటే, తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించిన వేడుక ఏదంటే 2006 నాటి వజ్రోత్సవాల గురించే చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు దాన్ని మించి ఈ వేడుక వుంటుందట. మోహన్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబరు 17న విశాఖపట్నంలో భారీ వేడుక చేయడానికి ఆయన కుటుంబం, అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది నవంబరు 22 నాటికి మోహన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. అప్పట్నుంచి ఏడాది పాటు రకరకాల కార్యక్రమాలు మంచు ఫ్యామిలీ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే విశాఖలో ఈ భారీ వేడుక చేస్తున్నారు.

ఈ వేడుక వజ్రోత్సవాల కన్నా మిన్నగా ఉంటుందని, తెలుగు సినిమా చరిత్రలోనే ఇంత పెద్ద వేడుక మరొకటి చూసి ఉండరు అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సహా టాలీవుడ్ ప్రముఖ హీరోలందరూ ఈ వేడుకకు హాజరవుతారని, ఈ వేడుకకు గ్లామర్ టచ్ కూడా బాగానే ఉంటుందని చెబుతున్నారు. సౌత్ ఇండియా అంతటా ఈ ఫంక్షన్ చర్చనీయాంశమవుతుందని, వేరే భాషలకు చెందిన పెద్ద హీరోలు కూడా చాలామంది ఈ వేడుకకు రాబోతున్నారని చెబుతున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ కొన్ని నెలల నుంచే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కొన్ని రోజులుగా విశాఖలోనే తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న మంచు మనోజ్ ఆ ఏర్పాట్లను చూసాడు. మంచు విష్ణు కూడా ఈ మధ్యే వైజాగ్ వెళ్లి ఏర్పాట్లు చూసి వచ్చాడు.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను లొంగదీసుకున్నాడు.. ఆ పై..

ఇది కూడా చదవండి: 'పక్కా లోకల్' అంటూ కాజల్ ఇరగదీసింది(వీడియో)

English summary

Mohan Babu 40 years event getting bigger than Vajrotsavam. Collection king Mohan Babu 40 years event is doing bigger than Vajrotsavam in Vishakapatnam.