బాలయ్యను కలెక్షన్ కింగ్ ఎందుకలా అన్నాడు

Mohan Babu About Balakrishna In Lepakshi Utsavam

04:28 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Mohan Babu About Balakrishna In Lepakshi Utsavam

కలెక్షన్ కింగ్ , డిలాంగ్ కింద మోహన్ బాబు సంచలనానికి మారుపేరు. ఉన్నది ఉన్నట్టు మొహమాటం లేకుండా మాట్లాడతానని అంటుండాడు. ఎవరినీ పొగడాల్సిన అవసరం గానీ , ఉత్తినే అనాల్సిన పని గానీ నాకు లేదని అంటాడు. ఇటీవలే బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో మెగాస్టార్ మీద కామెంట్లు చేసిన మోహన్ బాబు తాజాగా నందమూరి అందగాడు గురించి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది.  "కొద్ది నెలల క్రితం మా  కాలేజీ ముందు బాలయ్య అభిమానులు ఫ్లెక్సీలను పెడితే ఎవరో తీసేశారు.  దానిపై కొందరు చెప్పుడు మాటలు బాలకృష్ణ వరకూ తీసుకెళ్లారు. అయినా బాలయ్య  ఏమాత్రం తనకు ఫోన్ చేయలేదు. ఇదేంటని అడగలేదు. ఫోన్ చేయాలనుకుంటుండగానే తర్వాతి రోజు బాలయ్యే మా కళాశాలకు వచ్చారు. ‘ఫోటో మీరు తీసేయించి ఉండరు. ఎవరో కావాలనే మీపై నాకు ఫిర్యాదు చేశారు. అదేం పట్టించుకోకండి’ అని నాతో అన్నారు. అందుకే బాలకృష్ణ చెప్పుడు మాటలు వినే రకంకాదు" అని మోహన్ బాబు అన్నారు.

లేపాక్షి ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. అయితే  బాలయ్యను నేను పొగడాల్సిన అవసరం లేదన్నారు. రెండు నెలలు నటిస్తే కొన్ని కోట్ల డబ్బు వస్తుందనీ, అయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం డబ్బును లెక్క చేయని వ్యక్తి బాలకృష్ణ అని మోహన్ బాబు, బాలయ్యను ప్రశంసించారు. వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన బాలకృష్ణకు, ఆయన అభిమానులకు అభినందనలు తెలిపారు. 

లేపాక్షి ఉత్సవం ......

1/6 Pages

మోహన్ బాబు స్పీచ్

లేపాక్షి ఉత్సవంలో మోహన్ బాబు బాలకృష్ణ ను ఉద్దేశించి చేసిన స్పీచ్ అందరిని ఆకట్టుకుంది.

English summary

Versatile actor Mohan Babu has surprised every one in the occasion of Lepakshi Utsavam in Ananthapuram district.Mohan Babu says that Balakrishna was a very good person .He never believe when someone give wrong information to Balakrishna.Mohanbabu also explained about one incident in his speech.He also says that Senior NTR said to him they two were like brothers.