పార్టీ ఫిరాయింపుల పై డైలాగ్ కింగ్ షాకింగ్ కామెంట్స్

Mohan Babu Comments On Jumping MLAs

06:29 PM ON 4th June, 2016 By Mirchi Vilas

Mohan Babu Comments On Jumping MLAs

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య జోరుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. తెలంగాణాలో టిఆర్ఎస్, ఎపిలో టిడిపి ఈ తరహా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. దీనిపై డైలాగ్ కింగ్ - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేసారు. ‘‘ఇవాళ ఒక పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే లేదా ఎంపీ ఇంకో పార్టీలోకి వెళ్లిపోవడం వంటి నీచ నికృష్టమైన విషయాలను అప్పట్లోనే ‘అసెంబ్లీ రౌడీ’లో చూపించాం’’అని మోహన్ బాబు వ్యాఖ్యాంచారు. ఇంతకీ ఈ టాక్ ఎందుకు వచ్చిందంటే, శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఆ చిత్రం విడుదలై శనివారంతో పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం దర్శకుడు బి. గోపాల్ , రచయిత పరుచూరి గోపాలకృష్ణతో కలిసి 'అసెంబ్లీ రౌడీ' హీరో మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. అదండీ సంగతి.

English summary

Mohan talks to media on the eve of his super hit film Assembly rowdy was completed 25 years and he said that they show about jumping MLA's in that movie and made some comments on that.