సినీపరిశ్రమలో '40 వసంతాలు' పూర్తిచేసుకున్న మోహన్‌బాబు...

mohan babu completes 40 years career in film industry

03:48 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

mohan babu completes 40 years career in film industry

'స్వర్గం-నరకం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన విలక్షణ నటుడు మోహన్‌బాబు. ఈ చిత్రం నవంబర్‌ 22, 1975 లో విడుదలయింది. అంటే నవంబర్‌ 22, 2015 సంవత్సరానికి సరిగ్గా 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నలభై ఏళ్లలో మొత్తం 561 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్‌ నటించిన సర్ధార్‌ పాపారాయుడు చిత్రంలో మోహన్‌బాబు బ్రిటిష్‌ దొరగా నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. డైలాగ్‌ చెప్పడంలో తనకంటూ ఒక స్టైల్‌ని పరిచయం చేసుకున్నారు. కలెక్షన్‌ కింగ్‌గా వెలిగిపోయారు. ఇప్పటి వరకు 561 చిత్రాల్లో నటించిన మోహన్‌బాబు 181వ చిత్రాల్లో హీరోగా నటించారు. పదహారేళ్ల వయసు, డ్రైవర్‌రాముడు, సత్యం శివం, ప్రేమాభిషేకం, జస్టిస్‌చౌదరి వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించారు.

ముందు విలన్‌గా వచ్చి ఆ తరువాత హీరోగా నటించారు. మంచు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించి 50 కు పైగా చిత్రాలని నిర్మించారు. 1995 లో రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. మోహన్‌బాబు హీరోగా నటించిన అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, అల్లరిమొగుడు, బ్రహ్మా, మేజర్‌చంద్రకాంత్‌, పెదరాయుడు వంటి చిత్రాలు తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచాయి. శ్రీవిద్య నికేతన్‌ అనే విద్యాసంస్థను ప్రారంభించి ఎంతో మంది పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. మోహన్‌బాబు కి ముగ్గురు పిల్లలు మంచు లక్ష్మీప్రసన్న, మంచు విష్ణువర్ధన్‌బాబు, మంచు మనోజ్‌కుమార్‌. ఇందులో లక్ష్మీప్రసన్న నిర్మాతగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోగా, మంచు విష్ణు, మనోజ్‌లు మాత్రం హీరోలుగా వెలుగొందుతున్నారు.

మోహన్‌బాబుకి 2007 లో ప్రభుత్వం పద్మశ్రీ పురష్కారాన్ని అందజేసింది. ఇక తన సినీ ప్రయాణంలో నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచు వారి కుటుంబం ప్రత్యేక వేడుక ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు, టి.సుబ్బిరామి రెడ్డి, విక్టరీ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary

mohan babu completes 40 years career in film industry