ఈ ముగ్గురూ కలిస్తే, చెడుగుడేనా..

Mohan Babu Dasari Narayana Rao To Join In Janasena

03:48 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Mohan Babu Dasari Narayana Rao To Join In Janasena

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శాశ్వత శత్రువులు ఉండరని అంటారు కదా ...అలాంటప్పుడు ఎన్ని మార్పులైనా జరగడం సహజం ...ఎపిలో ఎన్నికల సమయానికి ఇంకా మూడు సంవత్సరాల వ్యవధి వున్నా, ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనునట్లు ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ కాంబినేషన్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ద్రోహం చేసిన బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని,అందుచేత కొత్త కలయిక ,ఫార్ములా సిద్ధం అవుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో బలంగా ఉన్నపార్టీలు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ లను ధీటుగా ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలను జనసేన పార్టీ ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెప్పిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: మంటతో ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు

మొన్న జన్మదిన వేడుకలను జరుపుకున్న దాసరి ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ధైర్యం ఉన్నవారే రాజకీయాల్లోకి రావాలని, సున్నితమైన మనసు ఉన్న వారు రాజకీయాల్లోకి రావడం ద్వారా లేనిపోని బురద అంటుకోవడం తప్ప జరిగేదేం ఉండదని, పవన్ కు ఆ ధైర్యం ఉందని' అన్నారు. పవన్ మాటమీద నిలబడుతాడని, ఆయన కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని కూడా చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెప్పిన ఆయన పవన్ ధైర్యవంతుడని, రాజకీయాల్లో రాణించగలడన్న నమ్మకం తనకుందన్నారు. దీని బట్టి చూస్తే డాక్టర్ దాసరి జనసేనకు మద్దతు ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. దాసరి జనసేనకు మద్దతుగా నిలిస్తే సినీ నటుడు మోహన్ బాబు కూడా పవన్ కు మద్దతు ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే, ఇప్పటికే పలుమార్లు తాను రాజకీయాల్లోకి వస్తానన్న మోహన్ బాబు ఏ పార్టీ లోకి వచ్చేది మాత్రం చెప్పలేదు. మోహన్ బాబు కు చంద్రబాబుతో, జగన్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారన్న ఆసక్తికరంగా మారింది. ఇక దాసరిని మోహన్ బాబు అభిమానంతో గురువు గారు అని పిలుస్తారు. దాసరి అన్నా, అయన మాట అన్నా మోహన్ బాబు గురి. దాసరి మాటను ఆయన ఎప్పుడూ కాదనరు. అందుచేత ఒకవేళ దాసరి జనసేనకు మద్దతుగా నిలిస్తే, కలెక్షన్ కింగ్ కూడా అటు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా. ఇదే నిజమైతే అద్భుత కాంబినేషన్ ఏర్పడినట్లేనని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో ...

ఇవి కూడా చదవండి: అల్లు అర్జున్ ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి: 24 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి: ప్రేమించడంలేదని రెండు చేతులు నరికేశాడు

`

English summary

Recently Pawan Kalyan had said that his Janasena Party was going to contest in 2019 elections and now another news came to know that Tollywood Senior Director and Producer Dasari Narayana Rao and Mohan Babu was going join in Pawan Kalyan's Janasena Party.