సుమలతని చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చిన మోహన్‌బాబు

Mohan Babu gave warning to Sumalatha that i will kill you

01:33 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Mohan Babu gave warning to Sumalatha that i will kill you

1997లో విడుదలైన 'సమాజానికి సవాల్‌' చిత్రంతో తెలుగులో సినీ రంగప్రవేశం చేసిన సుమలత ఆ తరువాత తెలుగులో 30కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాఫల్లో కలిపి దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించింది. ఆ తరువాత 1991లో కన్నడ నటుడు మరియు రాజకీయవేత్త అంబరీష్‌ని పెళ్ళి చేసుకుని సెటిలైపోయింది. పెళ్ళయ్యాక అడపాదడపా చిన్నచిన్న పాత్రల్లో నటించింది. అయితే ఇటీవలే ఒక ఛానల్‌ నిర్వహిస్తున్న ఓపెన్‌ హార్ట్‌ కార్యక్రమానికి ఇంటర్‌వ్యూకి వచ్చిన సుమలత తన వ్యక్తిగత, సినీ జీవిత రహస్యాలు కొన్ని బయటపెట్టింది.

అవేంటంటే కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు గారికి ఒక విషయం పై నామీద కోపం వచ్చి, నా భర్త అంబరీష్‌తో నువ్వు మంత్రివి కాబట్టి ఊరుకున్నాను లేదంటే నీ భార్యని చంపేసేవాడిని అని అన్నారు. దీనితో పాటు మరికొన్ని విషయాలు కూడా చెప్పింది. నేను అంబరీష్‌ని పెళ్ళి చేసుకుంటున్నాని తెలిసి సుహాసిని నీకేమైనా పిచ్చా అంటూ కామెంట్‌ చేసింది. నాకు హేమమాలిని, రేఖ, వైజయంతీ మాల వంటి హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగే అర్హత ఉన్నా నా ఎత్తు వల్లే అవకాశాలు కోల్పోయానని చెప్పింది. నేను కమల్‌హాసన్‌ గారికి వీరాభిమానని కానీ ఆయనతో నటించే అవకాశం నాకు రాలేదన్న విషయం నన్నెప్పుడూ బాధ పెడుతుంది. నున్న చాలా మంది హీరోలు పెళ్ళి చేసుకోమని కోరారని చెప్పింది.

చాలా మంది పెద్ద హీరోలు నన్ను ప్రతీసారి చెప్పులు తీసేయమని గొడవ చేసేవారు, దీనితో కోపం వచ్చి నా కాళ్లు నరుక్కోమంటారా అని వారిని అడిగే దాన్ని. నేను సినిమాల్లో ఫెయిల్‌ అయ్యానన్న విషయం నన్ను చాలా సార్లు బాధిస్తుంది. ఎప్పుడైనా నేను నటించిన సినిమాలు టీవీలో వస్తే నేను చూడను. ఎందుకంటే అప్పుడు నేను ఎంత చెంఢాలంగా నటించానో ఇప్పుడు తెలిసి బాధగా ఉంటుందని వివరించింది.

English summary

Mohan Babu gave warning to Sumalatha's husband Ambarish that if u are not Minister then i will kill your wife.