పరిశ్రమలో విలువలు ఒక శాతమే వున్నాయి

Mohan Babu Interview On His Birthday

10:01 AM ON 19th March, 2016 By Mirchi Vilas

Mohan Babu Interview On His Birthday

విలక్షణ నటుడు , డైలాగ్ కింగ్ , కలెక్షన్ కింగ్ ఇలా ఏ పేరుతో వ్యవహరించినా అతను మోహన్‌బాబు అని తెల్సిపోతుంది. భక్తవత్సలం నాయుడు మోహన్ బాబుగా మారి, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హీరోగా, సహా నటుడిగా , నిర్మాతగా ఇలా విభిన్న రూపాల్లో చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ వేళ మోహన్ బాబు పుట్టినరోజు. పుట్టినరోజు కు దండలు తేవొద్దని , ఆ డబ్బుని స్వచ్చంద సంస్థలకు ఇవ్వాలని ఇప్పటికే విజ్ఞప్తి చేసాడు. ‘అన్నగారు ఎన్టీఆర్‌ తర్వాత సంభాషణలు చెప్పడంలో నేనే’ అని చెప్పుకోగలిగేంత స్థాయి ఉన్న ఏకైక నటుడు మోహన్‌బాబు ఇటీవల నలభయ్యేళ్ల సుదీర్ఘ నట ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. శనివారం మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇంటర్యూ ఇచ్చాడు. "తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఎవరికి వారే గొప్ప అనుకుంటున్నారు. కానీ మనకంటే దేవుడు గొప్పవాడు. ప్రస్తుతం పరిశ్రమలో గౌరవం, విలువలు ఒక్క శాతం మాత్రమే ఉన్నాయి. నిన్నటితరం విలువలు మళ్లీ రావాలి" అని మోహన్ బాబు అన్నారు.

1/3 Pages

కన్నప్పాలో చేస్తున్నా ... 

"ఇంతకుముందు చేయని పాత్ర చేసుంటే బాగుండేదనే కోరిక మనసులో ఎప్పుడూ ఉంటుంది. నాకే కాదు, ప్రతి నటుడికీ అలాంటి ఆశ ఉండాలి" అని మోహన్ బాబు చెబుతూ, ‘కన్నప్ప’ అనే సినిమా చేయబోతున్నాం. అందులో నేనూ ఓ అద్భుతమైన పాత్ర పోషిస్తా. ఆ పాత్ర గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని ఆయన అన్నారు.

English summary

Mohan Babu says that there were no such people in tollywood like in olden days .Today each one going on their individual way inspite of thinking others.