డైలాగ్ కింగ్ కి అరుదైన గౌరవం

Mohan Babu Releases Book On His Popular Dialogues

10:25 AM ON 13th May, 2016 By Mirchi Vilas

Mohan Babu Releases Book On His Popular Dialogues

కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్‌బాబుకు అరుదైన గౌరవం లభించింది. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఆయన నటించిన సినిమాల్లోని ప్రధాన డైలాగ్‌లతో రూపొందించిన ‘బెస్ట్‌ డైలాగ్స్‌’ పుస్తకం బ్రిటిష్‌ పార్లమెంట్‌లో ఆవిష్కృతమైంది. ఓ తెలుగు పుస్తకావిష్కరణకు బ్రిటిష్‌ పార్లమెంట్‌ వేదిక కావడం ఇదే తొలిసారి. బ్రిటన్‌లోని భారతీయ సంతతి వ్యక్తికి చెందిన ఓ ప్రముఖ వార్తాపత్రిక ఆసియన్‌ లైట్‌ పదో వార్షికోత్సవంలో భాగంగా ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో మోహన్‌బాబును ప్రాణం పురస్కారంతో గౌరవించారు. ఎంపీలు బాబ్‌ బ్లాక్‌మేన్‌, వీరేంద్ర శర్మ మోహన్‌బాబుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.కార్యక్రమంలో మోహన్‌బాబు సతీమణి నిర్మల, తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్‌, కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. భారతీయ సినిమా పరిశ్రమ, సేవలకు, విద్య, క్రీడారంగాల్లో మోహన్‌బాబు చేసిన సేవలకుగాను ఈ పురస్కారం అందించినట్లు ఆసియన్‌ లైట్‌ సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి:ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి(వీడియో)

ఇవి కూడా చదవండి:త్వరలో ఫేస్‌బుక్‌లో 360డిగ్రీ ఫొటోలు

English summary

Manchu Mohan Babu has written a book on his popular dialouges and this book was released in British parliament. This was the first book to release on Britian Parliament.Along With Manchu Mohan Babu,His Wife,Manchu Vishnu , Manchu Manoj and Manchu Lakshmi were also attended to this event.