మెగాస్టార్ పై మోహన్ బాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు 

Mohan Babu satires on Chiranjeevi in Shatrughan Sinha's biography book launch

05:29 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Mohan Babu satires on Chiranjeevi in Shatrughan Sinha's biography book launch

వీలు చిక్కినప్పుడల్లా మెగాస్టార్ చిరంజీవి , కలెక్షన కింగ్ మోహన్ బాబుల మధ్య మాటల యుద్ధం జరుగుతూ వుంటుంది. తెలుగు సినిమా 75ఏళ్ళ ఉత్సవంలో లెజెండ్ , సెలబ్రిటీ ల విషయమై ఇద్దరి మధ్యా మాటల తూటాలు పేలాయి. మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎంటర్ అయ్యాడు. అలాగే మరోసారి ఇలాంటే గొడవే జరిగింది. ఇక తాజాగా మొన్న భాగ్యనగరంలో హిందీ నటుడు ,బిహారీ బాబు జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ జరిగినపుడు కూడా వీరిద్దరి మధ్యా మాటలు పేలాయి. ఈ సభలో ఇంగీస్లు తెలుగు మిక్సింగ్ చేసి మాట్లాడుతూ మోహన్ బాబు ఇక చిరంజీవి అన్న మాటలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఈజ్ అనగానే ఈజ్ కాదు వజ్ అనే మాటలు సభలో వినిపించడంతో నవ్వులు విరిశాయి. ఇక లాభం లేదని తెలుగులోనే ప్రస్తావిస్తూ 'చిరంజీవి ఏమన్నాడు. నేను శత్రుఘ్న సిన్హాలా ఉంటానని అన్నాడు. నేను శత్రుఘ్న సిన్హాలా ఉండను , నాలాగే శత్రుఘ్న సిన్హా ఉంటాడు' అని మోహన్ బాబు అనేసాడు. చిరంజీవిను ఉద్దేశించి 'నువ్వు నువ్వే , నేను నేనే . నాలాగ నువ్వు ఉండలేవ్ , నీలాగా నేను ఉండను' అని మోహన్ బాబు అన్నాడు.

English summary

Chiranjeevi and Mohan Babu have exchanged satires on their comments during the veteran Bollywood actor Shatrughan Sinha's biography book launch event in Hyderabad. Malayalam superstar Mohanlal, Congress leader Subbarami Reddy, Margadarsi Chit Fund limited MD Sailaja Kiran and socialite Pinky Reddy were attended to this book launch event.