అన్ని కోట్లు... ఇన్ని కోట్లు ... కలెక్షన్స్ వట్టి గ్యాస్

Mohan Babu Sensational Comments On Movie Collections

04:00 PM ON 17th September, 2016 By Mirchi Vilas

Mohan Babu Sensational Comments On Movie Collections

ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడం కలెక్షన్ కింగ్ విలక్షణ శైలి. నటుడిగా 573 చిత్రాలు... నిర్మాతగా 72 సినిమాలు... మొత్తంగా చూస్తే నాలుగు దశాబ్దాల ప్రయాణం లో విలన్ గా , క్యారక్టర్ నటుడిగా, హీరోగా ఎన్నో పాత్రలు అవలీలగా పోషించిన మోహన్ బాబుకి హిట్లూ, సూపర్ హిట్లూ, బాక్సాఫీసు దగ్గర జెండా ఎగరేసిన సినిమాలెన్నో! డైలాగ్ చెప్పాలన్నా, డ్రామా పండించాలన్నా, మోహన్ బాబుకే సాధ్యం. అలాంటి మోహన్ బాబు 40 వసంతాల సినీ జీవితం పూర్తయిన సందర్భాంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఈనాటి సినీ కలెక్షన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

'కష్టాలు అనుభవించకపోతే సుఖం విలువ ఏం తెలుస్తుంది? అందుకేనేమో నా కెరీర్ ప్రారంభంలో కష్టాలు చుట్టుముట్టాయి. తిండికీ, నిద్రకీ కరవే. ఫ్లాట్ ఫామ్ పై పడుకొన్న రోజులు నాకింకా గుర్తున్నాయి. అయినా అంతా నా మంచికే అనుకొన్నా. కష్టసుఖాల్లో నా తోడుగా ఉంది నా శ్రీమతి. నా పిల్లలు ఐశ్వర్యంలో పెరిగినా ఆకలి బాధేంటో వాళ్లకు తెలుసు. అందుకే ఎవరైనా కష్టంలో ఉన్నారంటే విష్ణు, మనోజ్ లు చలించిపోతుంటారు. అని చెప్పుకొచ్చాడు.

ఇప్పటి నిర్మాత పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. ఈ తప్పు కచ్చితంగా నిర్మాతదే. ఓ దర్శకుడు హిట్టు కొడితే అతని చుట్టూ తిరగడం మొదలెడుతున్నారు. రూ.50 లక్షలకు అర్హుడైతే రూ.మూడు కోట్లు ఇస్తున్నారు. దాంతో రూ.పది కోట్లతో సినిమా తీసేవాడు.. అరవై కోట్లు ఖర్చుపెడుతున్నాడు. ఈ డబ్బంతా ఎవరిది? నిర్మాతలదీ కాదు. వాళ్లేమో బినామీల పేర్లు మీద సినిమాలు తీస్తున్నారు. అందుకే డబ్బుకి విలువ లేకుండా పోయింది. మా సినిమాకి ఇన్ని కోట్లు వచ్చాయి, అన్ని కోట్లు వచ్చాయి అని చెప్పుకోవడం కూడా అంతా గ్యాస్ , బూటకం ... వాళ్లు చెబుతున్న అంకెలు వేరు... వాస్తవాలు వేరు అని మోహన్ బాబు నేటి కలెక్షన్స్ పై గాలి తీసేసారు.

ఇది కూడా చూడండి: బుద్ధుని గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు

ఇది కూడా చూడండి: అందరికీ షేర్ చెయ్యండి: ఈ హాస్పిటల్ లో వారం రోజులు పాటు హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ!

English summary

Mohan Baby was known for his unique mentality and he was acted in so many movies as villan, character artist and hero. recently in an interview he made some sensational comments on Movie collections. He said that collection which were showing were fake.