మహేష్ పొలిటికల్ ఎంట్రీ పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

Mohan Babu shocking comments about Mahesh Babu political entry

04:14 PM ON 28th June, 2016 By Mirchi Vilas

Mohan Babu shocking comments about Mahesh Babu political entry

చాలా మంది సినీ స్టార్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. చాలా వరకు సక్సెస్ అయ్యారు. బాలీవుడ్ నుండి మన టాలీవుడ్ వరకు చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు. మన దగ్గర ఎన్టీఆర్ గురించి అందరికి తెలుసు. సినిమా రంగం నుండి వచ్చిన ఆయన తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టి అధికారాన్ని సంపాదించుకుని రాజకీయాల్లో కొత్త ఒరవడి నేర్పారు. అలాగే తమిళనాడులో జయలలిత కూడా రాజకీయాల్లో కీలకంగా మారి, తమిళనాడును ఏలుతున్నారు. మొన్నీమధ్యన పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పేరుతో ఓ పార్టీని పెట్టారు. ముందు నుండి కూడా రాజకీయాలతో సంబంధం ఉన్న మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మహేష్ బాబు కూడా అదే బాటలో నడుస్తాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఆ మధ్యన మహేష్ బాబు పలానా పార్టీలో చేరతారు.. అని ఎన్నికలకు ముందు కాస్త హడావిడి చేసినా కానీ తర్వాత మాత్రం మహేష్ దాని మీద స్పందించలేదు. తాజాగా మరోసారి మహేష్ పొలిటికల్ ఎంట్రీ మీద వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మహేష్ పలానా పార్టీలో చేరతారు అని సినీ నటుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు అందరికి షాకిచ్చాయి. ఇంతకీ అందులో ఎంత వరకు నిజం ఉంది అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. కాగా మోహన్ బాబు చెప్పిన ప్రకారం మహేష్ బాబు త్వరలోనే జగన్ తో కలిసి రాజకీయాల్లోనూ కాలుమోపనున్నారు అని తెలుస్తోంది.

ఏపీలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జగన్ తో కలిసి మహేష్ బాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారని చర్చ జరగుతోంది. తాజాగా నిర్వహించిన ఓ ఇంగటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు మోహన్ బాబు. ఒకవేళ మహేష్ పార్టీలో చేరాలనుకుంటే.. బహుశా జగన్ పార్టీలో చేరతారు అని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డితో మహేష్ బాబు తండ్రి కృష్ణకు ఉన్న అనుబంధంతో ఆ వ్యాఖ్యలు చేస్తున్నట్లు కూడా ఆయన అన్నారు. ముందు నుండి రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ కాలుమోపినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఎందుకంటే జగన్ పవన్ ను ఎదుర్కోవడంలో భాగంగా మహేష్ ను రంగంలోకి దించి చెక్ పెడతారు అనే వాదన కూడా ఉంది.

English summary

Mohan Babu shocking comments about Mahesh Babu political entry