నాగార్జున కు మోహన్ బాబు షాక్

Mohan Babu Shocks Nagarjuna

12:27 PM ON 26th April, 2016 By Mirchi Vilas

Mohan Babu Shocks Nagarjuna

ముక్కుసూటి తనంకు మారుపేరుగా నిలిచే మోహన్ బాబు ఇటీవల జరిగిన "ఆడో రకం ఈడో రకం" సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. మెగా హీరో ల పై ఇన్ డైరెక్ట్ గా సెట్టైర్లు వేసిన మోహన్ బాబు అక్కినేని నాగార్జున ను సైతం వదల్లేదు . అక్కినేని నాగార్జున ఎప్పటి నుండో తీయాలనుకుంటున్న "గుండమ్మ కధ" సినిమా పై మోహన్ బాబు కన్నేసారు . యంగ్ టైగర్ ఎన్టీఆర్ , నాగ చైతన్య లు హీరోలుగా నాగార్జున అలనాటి ఆణిముత్యం "గుండమ్మ కధ" సినిమాను తెరకెక్కించాలని ఎప్పటి నుండో భావిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాను మంచు విష్ణు రాజ్ తరుణ్ తో కలిసి తీస్తానని మోహన్ బాబు తన మనసులోని మాటను బయటపెట్టారు.

ఇవి కూడా చదవండి: న్యూడ్ గా కనిపించబోతున్న హీరో

మంచు విష్ణు , రాజ్ తరుణ్ ల కాంబినేషన్లో గుండమ్మ కథ సినిమాను తెరకెక్కించాలని , అంతే కాకుండా ఆ సినిమాకు దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తాడని చెప్పుకొచ్చాడు . మోహన్ బాబు ఇలా ప్రకటించడంతో ఎన్‌టిఆర్, నాగచైతన్య కలయికలో నాగార్జున తెరకెక్కించాలని భావిస్తున్న "గుండమ్మ కథ" రీమేక్ మంచు విష్ణు,రాజ్ తరుణ్ లతో మోహన్ బాబు ప్రకటించి నాగార్జునకు షాకిచ్చాడు . మరో అతిధిగా హాజరైన దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ హీరోలను కాకుండా సినిమా కధలను నమ్మి సినిమాలు తీయాలని, సినిమాలు హిట్ అవుతున్నాయని హీరోలు రేట్లు పెంచేసి నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదని సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇవి కూడా చదవండి: ఎన్టీఆర్ అంటే నాకు కుళ్ళు: శృతి హాసన్

ఇవి కూడా చదవండి:అడల్ట్‌ సినిమాల్లో నటించడానికి రెడీ

English summary

Senior Actor Mohan Babu shocks Akkineni Nagarjuna by Saying that He was planning to remake "Gundamma Kadha" movie with Manchu Vishnu and Raj Tarun. Previously Akkineni Nagarjuna Planned to do this remake with NTR and Naga Chaitanya.