ఒక జత చెప్పులు, రెండు జతలబట్టలు...ఇదే ఆస్థి

Mohan Babu Speech At Dasari 72nd Birthday

11:02 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Mohan Babu Speech At Dasari 72nd Birthday

ఒకప్పుడు భక్త వత్సలం నాయుడు .. ఆ తర్వాత మోహన్ బాబు అయ్యాడు. మొదట్లో డైలాగ్ కింగ్ , ఆ తర్వాత కలెక్షన్ కింగ్ గా మారి తెలుగు పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు నటిస్తూనే నట వారసులుగా విష్ణు , మనోజ్ లను అందించాడు. ఏది మాట్లాడినా సూటిగా వుంటుంది. అయితే ఒక జత చెప్పులు, రెండు జతలబట్టలతో ఉన్న మోహన్ బాబు ఈ స్థాయికి చేరాడు. ఉన్నతికి ఎదిగినా తన గతాన్ని గుర్తు చేసుకుంటూనే వున్నాడు. మొన్న దర్శకరత్న దాసరి నారాయణరావు 72వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, ఎంపీ శతృఘ్నసిన్హా అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి-శృతిలయ స్వర్ణకంకణాన్ని ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు అందజేశారు.

ఇవి కూడా చదవండి:నాలుగు అంతస్తుల పై నుంచి పిల్లల్ని తోసేసిన తల్లి

అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ గతంలోకి వెళ్ళిపోయారు. "నటుడిగా నాకు జన్మను ప్రసాదించిన తండ్రి దాసరి. ఒక జత చెప్పులు, రెండు జతలబట్టలతో వుండే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత దాసరిదే. రాయలసీమ వాడివి నీకు భాష రాదన్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఎన్టీఆర్‌ తర్వాత డైలాగు చెప్పాలంటే మోహన్‌బాబే అనే స్థాయికి నన్ను తీసుకొచ్చారు. గురువు దాసరిని కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే గౌరవిస్తా" అని మోహన్ బాబు కృతజ్ఞత చాటుకున్నారు. దాసరి పేరుతో స్వర్ణకంకణం అందుకోవడం పూర్వజన్మసుకృతం అని ఆయన పేర్కొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహించాలన్నారు. ఎంపీ డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి అధ్యక్షత వహిస్తూ దాసరి గొప్ప దర్శకుడు అయితే మోహన్‌బాబు అద్భుత నటుడు అని అన్నారు.

ఇవి కూడా చదవండి:సీక్రెట్ ప్లేసులో 'ఓం' టాటూ వేయించుకున్న పాప్ సింగర్!

ఇవి కూడా చదవండి:వర్మపై పగబట్టిన హీరోయిన్ ఎవరు?

English summary

Mohan praised Dasari Narayana Rao on the event of Dasari Narayana Rao 72nd Birthday Celebrations. Mohan Babu Said that Dasari Narayana Rao was like his father. Later Mohan Babu was inaugurated with Gold ornament by Dasari Narayana Rao.