చంద్రబాబా , జగనా ... కలెక్షన్ కింగ్  దారెటు

Mohan Babu To Join In Politics

10:12 AM ON 7th April, 2016 By Mirchi Vilas

Mohan Babu To Join In Politics

కుండబద్దలు కొట్టినట్లు చెప్పే , కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అయితే కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, ప్రస్తుతం ఉన్న పార్టీల్లోనే చేరుతానని తిరుపతిలో ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల గురించి తొందరలోనే ప్రకటన చేస్తానన్నారు. సమర్ధుడైనవాడు అసమర్ధుడుగా జీవితం సాగించకూడదని... అంటే శక్తి ఉన్నంతవరకు, అవయవాలు పనిచేస్తున్నంత వరకు ఏదో ఒక మంచి చేయాలని ఆయన అన్నారు. నేను ఆవేశపరుడునే తప్ప... అవినీతిపరుడను కాదని మోహన్‌బాబు పేర్కొన్నారు. పార్టీ మారడమంటే ఎంగిలి మెతుకులు తినడం వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు అభిమాని కావడంతో పాటు గతంలో టీడీపీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు. మరోపక్క ఇటు జగన్‌కు బంధువు కూడా కావడంతో, టీడీపీలో చేరతారా లేక వైసీపీలో అడుగు పెడతారా లేకుంటే కమల దళంలో చేరతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి మెగా బ్రదర్స్ కి వ్యతిరేకంగానే ఉంటారని వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి :

ఎన్టీఆర్ కి రూ 700 జరిమానా

ఇంతకీ రోజా సారీ చెప్పినట్టా లేనట్టా

పవన్ పై ఉదయ కిరణ్ ఆరోపణలు

English summary

Collection King Mohan Babu Said that he will enter into politics. Mohan Babu said this words in Tirupathi.Mohan Babu previously elected as MP from Telugu Desham Party (TDP).