మోహన్‌బాబుని బూటు కాలితో తన్నిన దాసరి!!

mohan babu told that dasari hits me with his leg

04:48 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

mohan babu told that dasari hits me with his leg

నటుడిగా 40 ఏళ్లు ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న నటుడు మోహన్‌బాబు. డైలాగ్‌ కింగ్‌, కలెక్షన్‌ కింగ్‌ గా పేరు తెచ్చుకున్న గొప్ప నటుడు పద్మశ్రీ డా. మోహన్‌బాబు. ఈ 40 ఏళ్ల నట జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ మోహన్‌బాబు ఈ విధంగా స్పందించారు. నా అసలు పేరు భక్తవత్సలనాయుడు కానీ నా పేరుని మోహన్‌బాబుగా మార్చి నటుడిగా నాకు జీవితాన్నిచ్చింది దాసరి నారాయణరావుగారు. నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే. నేను జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది ఈయనకి మాత్రమే. నన్ను ఇంతటి వాడిని చేసిన ఆయనకి కృతజ్ఞతలు.

నందమూరి తారకరామారావు గారి తరువాత ఆ స్థాయిలో డైలాగులు మోహన్‌బాబు చెప్పగలడు అని పేరొచ్చిందంటే అదంతా దాసరి గారు నేర్పిన పాఠాలే. ఓ సినిమాలో డైలాగ్‌ సరిగా చెప్పకపోతే బూటు కాలితో తన్ని ఇదీ డైలాగ్‌ ఇలా చెప్పాలని నేర్పించారు. ఆ రోజు కోపంతో వెనక్కి వెళ్లిపోదామనుకున్న, కానీ ఆ రోజు నేను వెళ్లిపోయుంటే ఈ రోజు ఇక్కడ మీ ముందు నిలబడేవాడ్ని కాదు. నాకు నాన్నలా శిక్షణ ఇచ్చి నటనను నాలో నూరిపోశారు అని మోహన్‌బాబు అన్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ నా శిష్యుడు మోహన్‌బాబు 40 ఏళ్లు సినిమా జీవితాన్ని పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది.

కొన్ని కారణాల వల్ల సినిమాలకి దూరంగా ఉంటున్నాను, త్వరలోనే నేను-మోహన్‌బాబు కలయికలో చరిత్రను తిరగరాసే సినిమా తీయబోతున్నాను, ఇది ఒక చారిత్రాత్మక చిత్రం, సినీ పరిశ్రమలో విలన్‌గా పరిచయమై హీరోగా మారి మళ్లీ విలన్‌ పాత్రలు చేసి మళ్లీ హీరో అయిన నటుడు దేశంలో ఒక్క మోహన్‌బాబు మాత్రమే అని చెప్పారు.

English summary

mohan babu told that dasari hits me with his leg