రజనీ దుర్యోధనుడు ... మోహన్ బాబు కర్ణుడు

Mohan Babu Visits Super Star Rajinikanths House

10:27 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Mohan Babu Visits Super Star Rajinikanths House

సూపర్ స్టార్ రజినీకాంత్ కు.. విలక్షణ నటుడు మోహన్ బాబుకు ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. వాళ్లిద్దరిదీ దశాబ్దాల స్నేహ బంధం. ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. మోహన్ బాబు కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ రాయలసీమ రామన్న చౌదరి కి కథ అందించింది రజినీకాంతే. అంతేకాదు పెదరాయుడు సినిమాలో కీలక పాత్ర రజనీ పోషించి మోహన్ బాబుకి ఊతమిచ్చాడు. ఇలా ఒకప్పుడు చాలా సన్నిహితంగా మెలిగిన రజినీ, మోహన్ బాబు గత కొంత కాలంగా కలవడం తగ్గిపోయింది. ఐతే చాన్నాళ్ల తర్వాత మోహన్ బాబే స్వయంగా రజినీని కలవడానికి చెన్నై వెళ్లాడు. సూపర్ స్టార్ ఇంట్లో సందడి చేశారు.

తన చిరకాల మిత్రుడిని ఆప్యాయంగా కౌగిలించుకుని ఫొటో దిగిన మోహన్ బాబు, అంతటితో ఆగకుండా రజినీ భార్య లతతో రాఖీ కట్టించుకున్నారు. ఈ రెండు ఫొటోల్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా రజినీని దుర్యోధనుడిగా, తనను కర్ణుడిగా మోహన్ బాబు అభివర్ణించడం విశేషం. నా బెస్ట్ ఫ్రెండ్ ను కలిసి చాలా సమయం గడిపాను. అతను రాజులా కనిపించాడు. ఈ కలియుగంలో రజినీ దుర్యోధనుడైతే.. నేను కర్ణుడిని అని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

రజినీ సతీమణి గురించి స్పందిస్తూ.. చాన్నాళ్ల తర్వాత నా గొప్ప చెల్లెల్ని కలిశా. ఆమె లేకుంటే రజినీ ప్రస్తుతమున్న స్థితిలో ఉండేవాడు కాదన్నది నా బలమైన నమ్మకం అని మోహన్ బాబు చెప్పడం విశేషం. మొత్తానికి నెట్ లో ఈ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.

English summary

Tollywood Collection King MOhan Babu and Super Star Rajinikanth were very good friends and they both acted in some of the movies also. Recently Mohan Babu visited Rajinikanth's house and spend some time over there and Mohan Babu says that he was very happy to see his friend and he said that "Rajinikanth is a modern-day Duryodhana to my Karna".