మోహన్‌లాల్‌ బర్త్ డే గిఫ్ట్ ‘జనతా గ్యారేజ్‌’ సరికొత్త పోస్టర్‌

Mohan Lal first look in Janatha Garage

05:29 PM ON 21st May, 2016 By Mirchi Vilas

Mohan Lal first look in Janatha Garage

మలయాళ నటుడు మోహన్‌లాల్‌ శనివారం తన పుట్టిన రోజు చేసుకుంటున్న సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జనతా గ్యారేజ్‌’ సరికొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దర్శకుడు కొరటాల శివ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా మోహన్‌లాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ... ఆయన పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా సినీ ప్రముఖులు సాయి కొర్రపాటి, చంద్ర శేఖర్‌, రాయ్‌లక్ష్మి, విమలా రామన్‌ తదితరులు మోహన్‌లాల్‌కు సోషల్‌మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్‌ కథానాయకుడుగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్‌’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సమంత, నిత్యా మీనన్ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.

English summary

Mohan Lal first look in Janatha Garage