ఎన్టీఆర్‌ సినిమాలో మోహన్‌లాల్‌!!

Mohan Lal in Ntr-Koratala Siva movie

01:18 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Mohan Lal in Ntr-Koratala Siva movie

రెండే రెండూ సినిమాలతో తెలుగులో క్రేజ్‌ డైరెక్టర్‌గా మారి బాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన దర్శకుడు కొరటాల శివ. ఈయన దర్శకత్వం వహించిన మిర్చి, శ్రీమంతుడు రెండూ రికార్డు హిట్సే. తాజాగా కొరటాల శివ ఎన్టీఆర్‌తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఘాటింగ్‌లో బిజీగా ఉన్నారు, ఇది అయిపోయాక వీళ్లిద్దరి సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. శ్రీమంతుడుని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. కొరటాల శివ-ఎన్టీఆర్‌ కాంబినేషన్‌ అనగానే ఈ చిత్రం మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి.

తాజాగా ఇందులో మలయాళ సూపర్‌ స్టార్‌ వచ్చి చేరడంతో ఎక్స్‌పెక్టేషన్స్‌ మిన్నంటాయి. ఇందులో మోహన్‌లాల్‌ కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారని ఇటీవలే అధికారంగా ప్రకటించారు. మోహన్‌లాల్‌ చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కిస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.

English summary

Mohan Lal in Ntr movie which was directing by Koratala Siva and producing by Mythri Movie Makers.