మోహన్‌లాల్‌ చేతుల మీదుగా 'బంతిపూల జానకి'

Mohan Lal launches Banthi Poola Janaki logo

04:22 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Mohan Lal launches Banthi Poola Janaki logo

ధనరాజ్‌, దీక్షాపంత్‌, మౌనిక, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, సుడిగాలి సుధీర్, రాకెట్‌ రాఘవ, అదుర్స్‌ రఘు, అప్పారావు, రచ్చరవి ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా 'బంతిపూల జానకి'. ఈ సినిమాకి ప్రవీణ్‌ చందర్‌ దర్శకుడు. కెమెరామెన్‌ జి.ఎల్‌. బాబు, ఎడిటింగ్‌ శివ. వై. ప్రసాద్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ బోలే. ఈ సినిమా లోగోను మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కమీడియన్స్‌ అంతా కలిసి నటిస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని మోహన్‌లాల్‌ సినిమా యూనిట్‌ అందరినీ అభినందించారు. ఈ సినిమాలో నటిస్తున్న యాక్టర్‌ ధన్‌రాజ్‌ మాట్లాడుతూ సినిమా లోగోను ఆవిష్కరించిన మోహన్‌లాల్‌ గారికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ సినిమాలో కధాంశం సరికొత్తగా ఉంటుందనీ, ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తారు అని ధన్‌రాజ్‌ తెలిపాడు. ఈ సినిమా సింగిల్‌ షెడ్యూల్‌ లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఉజ్వల క్రియేషన్స్‌ పతాకం పై నిర్మిస్తున్నారు.

English summary

Mohan Lal launches Banthi Poola Janaki logo. Jabardasth team is acting in a lead roles in this film and hot beauty Deeksha Panth is acting in a female lead role.