జనతాగ్యారేజ్‌ నుండి మోహన్‌లాల్‌ ఔట్

Mohan lal unset with his role in janata garage

06:16 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Mohan lal unset with his role in janata garage

' నాన్నకు ప్రేమతో ' తరువాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'జనతా గ్యారేజ్‌' లో చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ ను ఎన్టీఆర్‌ తండ్రిగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మోహన్‌లాల్‌ చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత లేదని, తన పాత్రకి సరిగా డిజైన్‌ చేయలేదని అసంతృప్తి తెలియజేసారు. అంతేకాకుండా తన పాత్రలో కొన్ని మార్పులు చేయాలని, పాత్ర కాలవ్యవధి పెంచాలని మోహన్‌లాల్‌ సూచించారట. లేకపోతే ఈ పాత్రను పోషించనని, ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకుంటానని చెప్పారట. దాంతో కొరటాల శివ ఆయన పాత్రకు ప్రాముఖ్యత పెంచే పనిలో మునిగిపోయారట.

English summary

Mohan lal unset with his role in janata garage