యంగ్ టైగర్ ఫాన్స్ కి సారీ చెప్పిన మోహన్ లాల్

Mohanlal Says Sorry To NTR Fans

11:01 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Mohanlal Says Sorry To NTR Fans

మోహన్ లాల్ .. పేరు చెప్పగానే, ఒక్క మలయాళంలోనే కాదు, సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఆయన ఓ టాప్ సూపర్ స్టార్ అని చెప్పేయొచ్చు. ‘జనతా గ్యారేజ్ ’లో ఓ రోల్ చేయాలని యంగ్ టైగర్ ఎన్టీయార్ , కొరటాల శివ అడగ్గానే, అంగీకరించాడు. అలాంటి స్టార్ హీరో ఎన్టీయార్ అభిమానులకు ఓ విషయంలో సారీ చెప్పాల్సి వచ్చింది. ఏమాత్రం భేషజానికి పోకుండా సారీ చెప్పేసాడు. వివరాల్లోకి వెళ్తే,

హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ‘జనతా గ్యారేజ్ ’ ఆడియో విడుదల శుక్రవారం నాడు వైభవంగా జరిగింది. ఈ సినిమాలో నటించిన ఇంచుమించు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే, బిజీగా ఉండడం వల్ల మోహన్ లాల్ ఈ వేడుకకు హాజరుకాలేదు. అందుకే ఎన్టీయార్ అభిమానులకు సారీ చెబుతూ ఓ వీడియో బైట్ పంపారు మోహన్ లాల్ .

‘ఫంక్షన్ కు రావడానికి వీలైనంత వరకు ట్రై చేశా. కానీ బిజీ షెడ్యూళ్ల వల్ల కుదరలేదు. ఎన్టీయార్ అభిమానులందరికీ సారీ. కేరళలో జరిగే ఓనం పండగ సందర్భంగా మా జనతాగ్యారేజ్ విడుదలవడం ఆనందంగా ఉంది. ఎన్టీయార్ ఈజ్ మై లవబుల్ బ్రదర్ ’ అని ఆ వీడియోలో మోహన్ లాల్ చెప్పుకొచ్చాడు. దటీజ్ మోహన్ లాల్ అంటూ ఎన్టీ ఆర్ అభిమానులు కరతాళ ధ్వనులు చేసారు.

ఇది కూడా చూడండి: ఉప్పును తీసుకుని ఇంట్లో అక్కడక్కడా చల్లితే ఏమౌతుందో తెలుసా?

ఇది కూడా చూడండి: హుస్సేన్ తో రెచ్చిపోయిన రాధిక(వీడియో)

ఇది కూడా చూడండి: పెళ్ళికి ఆశీర్వదించడానికి ఈ దేవతలు వస్తారట!

English summary

Mohanlal did not attend ntr Janata Garage audio release function due to his busy schedule. Mohanlal said sorry to young tiger ntr fans.