మోహన్ లాల్ సంచలన వ్యాఖ్యలు

Mohanlal Sensational Comments On JNU

10:31 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

Mohanlal Sensational Comments On JNU

ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘జనతాగ్యారేజీ’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, జేఎన్‌యూ వివాదంపై స్పందించాడు. 'భారత్ చస్తుంటే మనం బ్రతికి ఉండి ఏం లాభం' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఉగ్రవాది అఫ్జల్‌ గురుకు అనుకూలంగా నినాదాలతో తెరపైకి వచ్చిన జెఎన్‌యూ వివాదంపై మాత్రం మోహన్ లాల్ నేరుగా స్పందించకుండా పై వ్యాఖ్యలు చేసాడు. పలు అంశాలు స్పృశిస్తూ , ఆవేదన వ్యక్తం చేసాడు. జాతీయ గీతాన్ని ప్రస్తావిస్తూ ఆర్మీ, జవాన్లు చేస్తున్న వీరోచిత త్యాగాలను.. దేశంలో నెలకొన్న పరిస్థితులపై తన మనోవేదనను పర్సనల్ బ్లాగ్‌లో వ్యక్తపరిచాడు. దేశ రక్షణలో భాగంగా సియాచిన్‌లో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలొదిలిన అంశాన్ని కూడా లాల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ప్రమాదంలో చనిపోయిన లాన్స్ నాయక్‌ సుధీష్‌ భౌతికకాయాన్ని ఆయన నాలుగేళ్ల కూతురికి చూపిస్తున్న ఫొటోను చూసి తాను చలించిపోయానని పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దేశ పౌరులు ఇంట్లో సుఖంగా కూర్చొని స్వేచ్ఛ, జాతీయవాదాలపై లెక్చర్లు దంచడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించాడు. దేశ పౌరులు జాతీయ భద్రత గురించి ఆలోచించాలన్నారు. స్వేచ్ఛను గౌరవించాలని, అయితే దాని గురించి వాదించడం మానుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు దేశమంటే, స్వేచ్ఛ అంటే ఏమిటో నిజమైన అర్థాన్ని వివరించాలని కోరారు. మొత్తానికి తన మనసులో మాట బయట పెడుతూ, మోహన్ లాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు సహజంగానే చర్చనీయం అయ్యాయి.

English summary

Mollywood Super Star Mohanlal responds on JNU controversy and written a blog by keeping title as ‘What’s the point of us living when India is dying’. Mohanlal started that his letter by saying the incident that he had seen recently in a news paper.