జనతాలో మోహన్‌లాల్‌ పాత్ర లీక్‌

Mohanlal To Act As Uncle For NTR

03:45 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Mohanlal To Act As Uncle For NTR

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'నాన్నకుప్రేమతో' చిత్రం తరువాత నటిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్‌'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ పాత్రకి సంబందించిన విషయం లీకైంది. అదేంటంటే మోహన్‌లాల్‌ ఇందులో ఎన్టీఆర్‌ కి అంకుల్‌ గా నటిస్తున్నారట. అంతేకాదు మోహన్‌లాల్‌ ఈ చిత్రంతో పాటు తెలుగులో మరో చిత్రంలో కూడా నటిస్తున్నారట. అందుకోసం తెలుగు కూడా నేర్చుకున్నారని సమాచారం. 'జనతా గ్యారేజ్‌' లో మోహన్‌లాల్‌ కి భార్యగా అలనాటి నటి దేవయాని నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరి 20 న సెట్స్‌పైకి వెళ్ళనుంది.

English summary

Malayalam Veteran Actor Mohanlal to act as uncle for Junior NTR in his next film Janata Garrage.This movie was going tob direct by Koratala Shiva and music by Devi Sri Prasad.Devayani to act as wife for Mohanlal