హృతిక్ రోషన్ మొహెంజొదారో ఫస్ట్ లుక్ అదుర్స్

Mohenjo Daro First Look

11:10 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Mohenjo Daro First Look

హాలీవుడ్ హీరో లకు ఏ మాత్రం తీసిపోని శరీరాకృతితో బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు మారు పేరుగా మారిపోయిన హృతిక్ రోషన్ హీరో గా తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ ఫిలిం "మొహెంజొదారో". క్రీస్తు పూర్వం విలసిల్లిన నాగరికత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు అశుతోష్ గోవరికర్ తెరకేక్కిస్తున్నాడు. ఇంతకు ముందు ఈ దర్శకుడు లగాన్ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను హీరో హృతిక్ రోషన్ విడుదల చేశాడు.

హృతిక్ రోషన్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో, ఒక సరికొత్త లుక్ లో కనిపిస్తూ ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ సరసన టాలీవుడ్ లో ముకుందా సినిమాలో నటించిన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

English summary

Bollywood Action Hero Hrithik Roshan was presently acting in a historical film called Mohenjo Daro and this movie first look was released by the Hrithik Roshan in his twitter and this movie was directed by Asutosh Govarikar and Pooja Hegde was acting as Heroine in the movie.