'జోదా అక్బర్' ను మించిన మొహెంజొదారో: ట్రైలర్

Mohenjo Daro movie trailer

01:25 PM ON 21st June, 2016 By Mirchi Vilas

Mohenjo Daro movie trailer

లగాన్, జోదా అక్బర్ వంటి చారిత్రాత్మక చిత్రాల దర్శకుడు అషుతోష్ గోవారికర్ తెరకెక్కిస్తున్న మరో చారిత్రాత్మక చిత్రం మోహెంజొదారో. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోని సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా అత్యంత భారీ బడ్జెట్ తో మొహెంజొదారోను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.. క్రీస్తు శకం కంటే ముందే ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేష న్లో మోహెంజొదారో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు మాహం అనే రాజు. అతడి దుశ్చర్యల భారి నుండీ ప్రజలను కాపాడటానికి అక్కడికి ఓ మూములు వ్యక్తి సర్మన్ వస్తాడు.

ఆ నగరం తనకు ముందే తెలుసు అనే విధంగా ఫీలవుతాడు. ఆ రాజ్యంలో నర్తకిగా జీవనం కొనసాగిస్తున్న చానీని అక్కడి ప్రజలు చాలా పవిత్రంగా చూసుకుంటారు. ఈ క్రమంలో సర్మన్-చానీ ప్రేమలో పడతారు. ఇక మాహం నుండి మోహెంజొదారోను సర్మన్ ఎలా రక్షిస్తాడు? అనే ఇతివృత్తంతో కథ సాగుతుంది. ఈ అంశాలను దర్శకుడు మలిచిన తీరు అద్భుతం. విజువల్ పరంగా మోహెంజొదారో సినిమాను చాలా గ్రాండ్ గా చూపించాడు అషుతోష్ గోవారికర్. ఇక ఏ.ఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతమనే చెప్పాలి. మొత్తంగా ఈ ట్రైలర్ ఓ దృశ్యకావ్యంలా ఉందనే చెప్పొచ్చు.

ఈ సినిమాను ఆగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి మోహెంజొదారో ట్రైలర్ పై మీరు ఓసారి వీక్షించండి.

English summary

Mohenjo Daro movie trailer