తండ్రి సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడా?

Mokshagna is giving entry with his father movie

09:45 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

Mokshagna is giving entry with his father movie

బాలయ్య వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' లో ఆయన తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తున్నాడా..? ఇలా కొత్త న్యూస్ ఒకటి బయటికి వచ్చి, తెగ హల్ చల్ చేస్తోంది... డైరెక్టర్ క్రిష్ ఈ మూవీతో ఈ కుర్రాడ్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. శాతకర్ణి కుమారుడు వశిష్ట పుత్ర పులామ్విగా మోక్షజ్ఞ నటించవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. శాతకర్ణి తర్వాత ఆయన కొడుకు వశిష్ట పుత్ర పాలనా పగ్గాలు చేబట్టాడన్నది చరిత్ర కథనం. మరి తన తనయుడు తన తాజా సినిమాలో నటించడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో లేదో తెలియదు. ఇక శాతకర్ణి లో రాజమాత గౌతమిగా బాలీవుడ్ నటి హేమమాలిని నటించనుందని, శాతకర్ణి భార్య రోల్ లో ఎవరిని ఎంపిక చేస్తారో ఖరారు కాలేదని అంటున్నారు.

ఏమైనా ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని, మొరాకోలో మే 9 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి సింగిల్ గా కాకుండా దాడితోనే తెరంగేట్రం చేయడానికి మోక్షజ్న నిర్ణయించుకుంటే, అదీ శాతకర్ణితో అయితే, ఆ చిత్రానికి అంచనాలు పది రెట్లు పెరిగిపోతుందని అంటున్నారు.

English summary

Mokshagna is giving entry with his father movie. Nandamuri Mokshagna is giving entry with Gautamiputra Satakarni movie.