మోక్షజ్ఞ ఎంట్రీ షూరూ 

Mokshagna To Debut In Ballayya Movie

09:50 AM ON 7th January, 2016 By Mirchi Vilas

Mokshagna To Debut In Ballayya Movie

తెలుగు ఇండస్ర్టీ‌కి మరో వారసుడి తెరంగేట్రం కానుంది. అది ఎప్పటినుండో చాలా మంది, ముఖ్యంగా నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మొక్షజ్ఞది. చాలాకాలంగా ఉత్కంఠ తెరలేపుతున్న నందమూరి వారసుడి తెరంగేట్రం గురించి ఎన్నో ఊహాగానాలు తిరుగుతున్నాయి. సంగీతం శ్రీనివాస్‌ బాలకృష్ణతో చేయాలి అనుకుంటున్న సినిమా ఆదిత్య 999. ఈ సినిమాలో యువరాజు పాత్రలో మొక్షజ్ఞ ఎంట్రీ చెద్దామని సంగీతం శ్రీనివాస్‌ అనుకుంటున్నారట. బాలకృష్ణ 100వ సినిమాకి బోయపాటి దర్శకుడు. మెగాస్టార్‌ వారసుడిగా వచ్చిన రామ్‌చరణ్‌ తన స్టార్‌డమ్‌ ను నిరూపించుకున్నాడు. నాగార్జున వారసులుగా తెలుగు చిత్ర సీమలో నాగ చైతన్య మరియు అఖిల్‌ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక బాలకృష్ణ వారసుడైన మొక్షజ్ఞ ఎంట్రీ మాత్రమే మిగిలుంది. కానీ మొక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాలంటే బాలకృష్ణ 100 వ సినిమా పూర్తి అవ్వాలి. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే నందమూరి అభిమానులను అలరించనున్నాడు.

English summary

BalaKrishna's son Mokshagna to make his debut in films in balakrishna next movie Aditya 999.