అసిస్టెంట్ డైరెక్టర్ గా మోక్షజ్ఞ

Mokshagna Turns Assistant Director For Gautamiputra Satakarni

10:42 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Mokshagna Turns Assistant Director For Gautamiputra Satakarni

తన తనయుడు మోక్షజ్ఞ వచ్చే ఏడాదిలో తెరంగేట్రం చేస్తాడని నటసింహం నందమూరి బాలయ్య పలుమార్లు స్వయంగా వెల్లడించారు.ఇంతలోనే ఆయన వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో మోక్షజ్ఞ ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడని ఫిల్మ్‌నగర్‌ లో వార్తలు వచ్చాయి.మరి ఆ చిత్రంలో మోక్షజ్ఞ నటిస్తాడో లేదో తెలియదు కానీ సహాయ దర్శకుడిగా పనిచేయబోతున్నాడు.కెమెరా ముందుకొచ్చేలోపు సినిమాకి సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన ఏర్పడాలనే బాలకృష్ణ తన తనయుడికి సహాయ దర్శకుడి బాధ్యతల్ని అప్పగిస్తున్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి: నితిన్ నా తమ్ముడిలా అనిపించాడు

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి ఓ చారిత్రక సినిమాకి, క్రిష్‌ లాంటి దర్శకుడి దగ్గర పనిచేస్తే మోక్షజ్ఞకి అన్ని విధాలుగా అవగాహన ఏర్పడుతుందని బాలకృష్ణ భావించినట్టు తెలిసింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, హీరో కాక ముందు బాలకృష్ణ కూడా తన తండ్రి ఎన్టీఆర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసాడు.ఇప్పుడు హిస్టరీ రిపీట్ అంటూ,తన తనయుడినీ అదే బాటలో నడిపిస్తున్నారన్నమాట. ఈ నెల 9 నుంచి మొరాకోలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రీకరణ మొదలుకానుంది.అందుకోసం దర్శకుడు క్రిష్‌ అన్ని ఏర్పాట్లూ చేసుకొన్నారు. మొత్తానికి బాలయ్య వందో చిత్రంతో బాలయ్య తనయుడు హంగామా చేయనున్నాడు.

ఇవి కూడా చదవండి:

‘బ్రహ్మోత్సవం’ టీజర్‌కి ‘కబాలి’ షాక్?

పవన్ సేనాపతి ఫస్ట్ లుక్ సందడి!

చనిపోయిన ప్రతీ మనిషి ఆత్మ ముందు ఆ గుడికే వెళ్తుందట!

English summary

Nandamuri Bala Krishna's Son Nandamuri Mokshgna was going to turn as Assistant Director for Bala Krishna 100th movie named "Gautami Putra Sartakarni".This movie was directing by Director Krish.