జక్కన్న ఫ్యామిలీలో చిచ్చు రేపిన  డబ్బు

Money Clashes In Rajamouli Family

09:48 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Money Clashes In Rajamouli Family

పైసా మే పరామాత్మ, డబ్బుంటేనే విలువ, డబ్బుకు లోకం దాసోహం ఇలా ఎన్నో సామెతలతో డబ్బుకు మంచి గిరాకీ వుంది. అందుకే డ‌బ్బు అనేది ఎంత‌ప‌నైనా చేస్తుంది…చిరకాల స్నేహితుల మ‌ధ్య చిచ్చు పెడుతుంది. ఒకే త‌ల్లి క‌డుపున పుట్టిన అన్న‌ద‌మ్ముల‌ను వేరు చేస్తుంది. బంధాల మ‌ధ్య గ్యాప్ కూడా పెంచుతుంది. అనుబంధాలను మాయం చేస్తుంది. ఇప్పుడు ఇదే డ‌బ్బు ఇప్పుడు టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఫ్యామిలీలో చిచ్చుపెట్టింద‌న్న వార్త‌లు టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. బాహుబ‌లి సినిమా కోసం జక్కన్న ఫ్యామిలీలో కార్తీకేయ నుంచి శివ‌శ‌క్తి ద‌త్తా లాంటి సీనియ‌ర్లు, కీర‌వాణి, రాజ‌మౌళి, ర‌మా రాజ‌మౌళి ఇలా వీళ్లంద‌రూ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో…ఎంత తెలివిగా, ప్లానింగ్‌తో సినిమాను ప్ర‌మోట్ చేసుకున్నారో అంద‌రికి తెలిసిందే.

ఇవి కూడా చూడండి:రైనా కు వార్నింగ్ ఇచ్చిన శిఖర్ ధావన్

బాహుబ‌లి పుణ్య‌మా అని రాజ‌మౌళి కుటుంబంలో కోట్లకు కోట్లు వ‌చ్చిప‌డ్డాయి. ఈ డ‌బ్బుతో ఎవ‌రికి వాళ్లు సెటిలైపోయారనే టాక్స్ కూడా ఇండ‌స్ట్రీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు బాహుబ‌లి 2 విష‌యంలో వాళ్ల కుటుంబంలో పెద్ద చిక్కులే వ‌చ్చి ప‌డ్డాయ‌ట‌. ఒక్కోసారి డ‌బ్బు ఎక్క‌వైనా అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న‌డానికి రాజ‌మౌళి ఫ్యామిలీయే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు ఇండ‌స్ట్రీలో కొంద‌రు ప్ర‌ముఖులు. బాహుబ‌లి రూ.600 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక బాహుబ‌లి 2పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఆర్టిస్టులంద‌రూ భారీగా పారితోష‌కాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మౌళి ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా ఎవ‌రికి వారు త‌మ‌కు అంత కావాలి..ఇంత కావాలి అని భారీగా రెమ్యున‌రేష‌న్ డిమాండ్ అడుగుతుండ‌డంతో అటు నిర్మాత‌లు, ఇటు రాజ‌మౌళి సైతం త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. ఆస్తులు వచ్చాకే గొడవలూ, ఆదాయం వచ్చాకే అసలైన చిక్కులు మొదలవుతాయని ఈ ఘటన మరోసారి రుజువుచేస్తోంది.

ఇవి కూడా చూడండి::

బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

సర్దార్ పై ఎన్టీఆర్ మెసేజ్ చూసి షాకైన దేవిశ్రీ

ముక్కు పుడక ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ?

English summary

Tollywood's Top Director S.S.Rajamouli was presently busy with Bahubali-2 movie. This movie was going to be release at the end of this year. Now according to a news Rajamouli family members like keeravani, Karthikeya etc were demanding more remuneration.