అరటి పండులో డబ్బులు దాచేసారు .. తీరా చూస్తే ..

money hidden in Bananas

12:13 PM ON 2nd February, 2017 By Mirchi Vilas

money hidden in Bananas

మాయలు మర్మాలు అన్నీ ఇన్నీ కాదండోయ్. అందుకే అన్నారు కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి అని... లేకపోతే డబ్బులు ఎలా దాచారో చూడండి. నిజాంగా షాకవుతాం. అవును అరటిపండ్లలోని గుజ్జును తీసేసి అందులో రూ. 45.69 లక్షలు దాచేసారు. ఈ సొమ్మును తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని కోజికోడ్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కోజికోడ్ విమానాశ్రమం నుంచి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులు తమ చెకిన్ లగేజీలో తీసుకువెళ్తున్న అరటిపళ్లలో కరెన్సీ దాచి.. ఎవరికీ అనుమానం రాకుండా తరలించడానికి ప్రయత్నించారు. వీరిని తనిఖీల్లో పట్టుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. సౌదీ కరెన్సీ అయిన రియాల్స్ ను వారీ విధంగా తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి పట్టుబడ్డారు.

ఇది కూడా చూడండి: ఇక రాబోయేవి బొద్దింక పాలు?

ఇది కూడా చూడండి: అది మెడా ... బొంగరమా(వీడియో)

English summary

some people stores money in bananas police cached them in airport.